Begin typing your search above and press return to search.

కోట‌.. రంగ‌స్థ‌లం చూడ‌లేదా?

By:  Tupaki Desk   |   11 May 2022 2:30 AM GMT
కోట‌.. రంగ‌స్థ‌లం చూడ‌లేదా?
X
క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌.. న‌ట‌న‌కు పెట్ట‌ని కోట‌గా పిల‌వ‌బ‌డే సీనియ‌ర్ న‌టులు కోట‌శ్రీ‌నివాస‌రావు `మా` ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. మంచు విష్ణుని స‌పోర్ట్ చేస్తూ నాగ‌బాబు, మెగాస్టార్ చిరంజీవిల‌ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మంచు విష్ణుని పొగుడుతూనే మెగా ఫ్యామిలీని ఇరుకున పెట్టే ప్రయ‌త్నం చేశారు.ఈ మాట‌ల‌కు నొచ్చుకున్న నాగ‌బాబు గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. ఎన్నిక‌లు అయిపోయాయి.. ఆ వివాదం స‌ద్దుమ‌నిగింది.

అయితే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ మెగాస్టార్ చిరంజీవిని ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ని టార్గెట్ చేస్తూ వివాదాస్ప‌దంగా స్పందించ‌డం ఇప్ప‌డు వైర‌ల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాకు న‌చ్చిన హీరో అని చెప్పిన కొట ఆ త‌రువాత అత‌ని కున్న ప్రొటెన్షియ‌లిటీ టాలీవుడ్ లో మ‌రో న‌టుడికి లేద‌ని చెప్పారు. బ‌న్నీ, మ‌హేష్ బాబు మంచి న‌టులే కానీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లో వున్న పొటెన్షియాలిటీ వాళ్ల‌లో లేద‌న్నారు. డైలాగ్ డెలివ‌రీ, డ్యాన్సులు బాగా చేస్తాడ‌ని చెప్పిన కోట శ్రీ‌నివాస‌రావు ఎన్టీఆర్ పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ని మించిన పొటెన్షియాలిటీ వున్న వాళ్ల‌ని చూడ‌లేద‌న్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ గురించి మాట్లాడుతూ రామ్ చ‌ర‌ణ్ లో పొటెన్షియాలిటీ క‌నిపించ‌లేద‌ని, పాత్ర‌ల‌ని ప్ర‌జెంట్ చేయ‌డంతో ఇప్ప‌టికి త‌డ‌బాటు క‌నిపిస్తోంద‌ని, చిరంజీవి కొడుకు కావ‌డం వ‌ల్లే అత‌నికి ఇంత పేరొచ్చిందే కానీ అత‌నిలో పొటెన్షియాలిటీ క‌నిపించ‌లేద‌ని కామెంట్ చేశారు. గ‌త కొంత కాలంగా చిరుని, చిరు ఫ్యామిలీ హీరోల‌తో అక్క‌సుని వెళ్ల‌గ‌క్కుతున్న కోట తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ అసంద‌ర్భంగా చిరుని, రామ్ చ‌ర‌ణ్ ని టార్గెట్ చేయ‌డం విడ్డూరంగా వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇన్ని మాట‌లు మాట్లాడే కోట‌ `రంగ‌స్థ‌లం` చూడ‌లేదా? లేక ఆ సినిమా ఆయ‌న కంటికి క‌నిపించ‌లేదా? అని కౌంట‌ర్లు వేస్తున్నారు. ఈ చిత్రంలో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ ప‌లికించిన అభిన‌యం, ఆది పినిశెట్టి పాత్ర చ‌నిపోతూ త‌న‌ని హ‌త్య చేసింది ఎవ‌రో చెబుతుంటే ఆ మాట‌లు త‌న చెవికి వినిపించ‌క చ‌ర‌ణ్ ప‌లికించిన హావ భావాలు న‌టుడిగా అత‌నిలోని పొటెన్షియ‌లిటీకి అద్దంప‌ట్టాయి. ఇది కోటాకు క‌నిపించ‌లేదా? అని ప‌లువురు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.

క‌రోనా స‌మ‌యంలో అన్నీ తానై ముందుండి న‌డిపించి ల‌క్ష‌లాది మంది కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించే ఏర్పాట్లు చేశారు చిరంజీవి. ప‌ని లేక అల‌మ‌టిస్తున్న కార్మికుల‌కు నేనున్నానంటూ అండ‌గా నిలిచారు. తానే ముందుకు రాక‌పోయి వుంటే ఆ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మ‌య్యేదా?.. ఇవ‌న్నీ తెలిసి కూడా కోట ఎందుకు ప‌దే ప‌దే మెగా స్టార్‌ని, ఆయ‌న ఫ్యామిలీ హీరోల‌ని టార్గెట్ చేస్తున్నారు. ఏం ఆశించి ఇలా కామెంట్ లు చేస్తున్నార‌ని మెగా అభిమానులు కోటాని నిల‌దీస్తున్నారు.