Begin typing your search above and press return to search.

రియాల్టీ షోలో న‌టి చేసిన ప‌నికి ఐదేళ్లు జైలు!

By:  Tupaki Desk   |   7 July 2019 12:45 PM IST
రియాల్టీ షోలో న‌టి చేసిన ప‌నికి ఐదేళ్లు జైలు!
X
ఇవాల్టి రోజున రియాల్టీ షోలు అన్ని చోట్ల న‌డుస్తున్న‌వే. రియాల్టీ షోల‌కు ఆద‌ర‌ణ బాగుండ‌టంతో వీలైన‌న్ని ఎక్కువ రియాల్టీ షోల మీద దృష్టి పెడుతున్నాయి టీవీ ఛాన‌ళ్లు. అయితే.. రియాల్టీ షో పేరుతో కొన్ని పిచ్చి పిచ్చి కార్య‌క్ర‌మాలు కూడా చేస్తున్నారు. రియాల్టీ షోలో పాల్గొన‌టం ఇంత ఖ‌రీదైన త‌ప్పు అవుతుంద‌ని ఏ మాత్రం ఆలోచించ‌ని ఒక న‌టికి భారీ షాక్ త‌గిలింది. తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా త‌ప్పు త‌ప్పే అంటున్న చ‌ట్టంలోని సెక్ష‌న్ల‌తో ఆమె విల‌విల‌లాడిపోతోంది.

రియాల్టీషోలో భాగంగా ఆమె ప్రద‌ర్శించిన పెర్ ఫార్మెమెన్స్ ఇప్పుడు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష‌కు కార‌ణ‌మ‌వుతోంది. దీంతో.. ఆమె ఇందులో నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో అర్థం కాక కిందామీదా ప‌డుతోంది. ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. సౌత్ కొరియాకు చెందిన లీ ఇయోల్ ఎమ్ అనే అని ఒక‌రు ఉన్నారు. ఆమె గ‌డిచిన కొద్ది నెల‌లుగా లా ఆఫ్ ది జంగిల్ అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు.

జూన్ 30న ఆమె పాల్గొన్న ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్క్ ఏమంటే.. బ్యాంకాక్ లోని థాయ్ మెరైన్ నేష‌న‌ల్ పార్క్ లోని స‌ముద్రంలోకి దిగిన లీ ఇయోల్ నీటి అడుగున ఉన్న ఒక అల్చిప్ప‌ను బ‌య‌ట‌కు తెచ్చారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. ఈ షో ఎయిర్ అయ్యాక‌.. స‌ద‌రు న‌టి తెచ్చిన ఆల్చిప్ప‌లు అంత‌రించి పోతున్న జాతికి సంబంధించిన‌వ‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది తెలీక జ‌రిగిన పొర‌పాటు.

అయితే.. అదేమీ ప‌ట్టించుకోని హ‌ట్ చావో మాయ్ నేష‌న‌ల్ పార్క్ అధికారులు స‌ద‌రు న‌టిపై థాయ్ వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణా చ‌ట్టాల్ని ఉల్లంఘించారంటూ కేసు న‌మోదు చేశారు. దీంతో.. స‌ద‌రు న‌టి కోసం పోలీసులు ఇప్పుడు గాలింపులు జ‌రుపుతున్నారు. ఈ మొత్తానికి కార‌ణ‌మైన రియాలిటీ సో నిర్మాత‌లు సారీ చెప్పినా అధికారులు మాత్రం కేసు వెనక్కి తీసుకోవ‌టానికి ఒప్పుకోవ‌టం లేదు.

న‌టి మీద క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశామ‌ని.. ఆమె కేసు విష‌యం కోర్టు ప‌రిధిలో ఉంద‌ని.. ఆమెకు శిక్ష వేయాలా? వ‌ద్దా? అన్న‌ది జ‌డ్జి మీద ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేరం కింద జ‌డ్జి కానీ శిక్ష వేయాల‌ని డిసైడ్ అయితే ఐదేళ్లు జైలుశిక్ష త‌గ్గ‌దంటున్నారు. ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయాన‌ని వేద‌న చెందుతోంది స‌ద‌రు న‌టి. రియాల్టీ షోలేమో కానీ.. ఇప్పుడా న‌టి నెత్తికి చుట్టుకుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.