Begin typing your search above and press return to search.

'ఆచార్య' గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కొరటాల

By:  Tupaki Desk   |   19 April 2020 7:00 AM IST
ఆచార్య గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కొరటాల
X
రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి ‘మిర్చి’తో మెగాఫోన్ చేతబట్టాడు కొరటాల శివ. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’.. ఇలా వరుస సూపర్ హిట్ సినిమాలతో ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ ఇవ్వడమే కాక టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలిచారు. తన సినిమాలతో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సమాజానికి చిన్నపాటి సందేశమివ్వడం ఆయన స్టైల్. 'భరత్ అనే నేను' సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఆచార్య' లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. నిజానికి లాక్ డౌన్ విధించక ముందే చిరంజీవి సూచన మేరకు ఈ చిత్ర షూటింగ్ ఆపేసారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల అనేక రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొరటాల శివ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలు బయటకి చెప్పాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయిందని.. మెగాస్టార్ 'సైరా' సినిమాతో బిజీగా ఉన్న కారణంగా షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయి స్లోగా నడిచిందని.. 'ఆచార్య' అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామో లేదో తెలియదు కానీ షూటింగ్ మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చాడు. 'ఆచార్య'లో మెగాస్టార్ పాత్ర గురించి తెలియజేస్తూ చిరంజీవి ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా ఉండబోతున్నాడని అభిమానులకు ప్రామిస్ చేసాడు. అంతే కాకుండా మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పవర్ ఫుల్ రోల్ క్రియేట్ చేసానని.. ఈ పాత్ర ద్వారా మెసేజ్ ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్ ని ఆకట్టుకొనేలా స్టన్నింగ్ గా కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా సంగీత బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.