Begin typing your search above and press return to search.

కొర‌టాల (Vs) మ‌హి.వి .. ఇద్ద‌రిలో ఎవ‌రితో ముందు?

By:  Tupaki Desk   |   31 July 2020 9:00 AM IST
కొర‌టాల (Vs) మ‌హి.వి .. ఇద్ద‌రిలో ఎవ‌రితో ముందు?
X
క్వారంటైన్ టైమ్ ని ఒక్కో హీరో ఒక్కోలా స‌ద్వినియోగం చేస్తున్నారు. మెజారిటీ హీరోలు క‌థ‌లు విన‌డం లాక్ చేయ‌డం.. స‌క్సెస్ లో ఉన్న ద‌ర్శ‌కుల‌కు అడ్వాన్సులు ఇవ్వ‌డం వ‌గైరా వ‌గైరా ప‌నుల‌తో బిజీ. ఈ కోవ‌కే చెందుతాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్ లో స్టోరీ హియ‌రింగ్ రూమ్ కి పిల‌వ‌డం .. పూర్తి క‌థ లేదా స్క్రిప్టు వింటాడు. న‌చ్చితే వెంట‌నే అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేయ‌డం వ్యాప‌కంగా మారింద‌ట‌.

అలా ఇప్ప‌టికే ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల్ని లాక్ చేశాడ‌ని ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొర‌టాల‌ను ఇప్ప‌టికే లాక్ చేసి చాలా కాల‌మే అయ్యింది. వ‌రుస సక్సెస్ ల‌తో రాజ‌మౌళి త‌ర్వాత అంత‌టివాడిగా దూసుకుపోతున్న కొర‌టాల‌కు అడ్వాన్స్ ఇచ్చి మ‌రీ లాక్ చేశాడ‌ట‌. పుష్ప త‌ర్వాత సినిమా చేద్దామ‌ని మాటిచ్చాడ‌ని తెలుస్తోంది.

అంతేకాదు.. యాత్ర ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ వినిపించిన క‌థ‌ను లాక్ చేశాడు. బ‌న్నితో కొర‌టాల .. మ‌హి వి రాఘ‌వ్ లాక్ అయిన‌ట్టే. అయితే కొరటాల శివ తో చేస్తున్నాడా లేక మహి వి రాఘవ తో సినిమా చేస్తున్నాడా .. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు ముందు? ఎవ‌రు త‌ర్వాత‌? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హి.వి.రాఘ‌వ్ తో బన్నీ సినిమా ఖాయ‌మే. అయితే ఈ ప్రాజెక్ట్ కి తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ నిర్మాతలుగా కొన‌సాగుతారని తెలిసింది. గీత ఆర్ట్స్ 2 లో ఈ సినిమా ఉండబోతుంది. ప్ర‌స్తుతం సుకుమార్ సినిమా పుష్ప పూర్త‌వ్వ‌గానే త‌దుప‌రి బెస్ట్ స్క్రిప్టు ఎవ‌రు ముందుగా చెబితే వారితో సినిమా చేసే వీలుంటుంది.