Begin typing your search above and press return to search.

మహేష్‌ సినిమాపై కొరటాల వైఫ్‌ ఎఫెక్ట్?

By:  Tupaki Desk   |   9 Sept 2016 9:00 PM IST
మహేష్‌ సినిమాపై కొరటాల వైఫ్‌ ఎఫెక్ట్?
X
అసలు కొరటాల శివ తన ఫ్యామిలీ దృక్పథం చేబుతుంటే చాలామంది షాకయ్యే ఉంటారు. ఎందుకంటే ఆయన ఇంట్లో అందరూ సమాజం పట్ల ఎంతో అంకిత భావం కలవారు. ఒక ప్రక్కన ఆయన సొంత తల్లిదండ్రులు కమ్యూనిష్టు భావాలు కలవారైతే.. ఆయన భార్య రామకృష్ణ పరమహంసను ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు కొరటాల వైఫ్‌ అరవింద ఎఫెక్ట్ త్వరలో మనోడు చేయబోయే మహేష్‌ బాబు సినిమాపై పడిందని తెలుస్తోంది.

నిజానికి లండన్ లో చదువుకున్న అరవింద.. కొరటాల శివను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే ఆమెకు సింప్లిసిటీ అంటే ఇష్టమట. ఇప్పటివరకు కొరటాల సంపాదించిన కోట్లలో కేవలం బ్రతకడానికి తినడానికి కావాల్సినంత ఉంచుకుని.. మిగిలినదంతా సొసైటీకి తిరిగిచ్చేయాలని భావజాలం ఆమెది. అందుకే పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏమైనా సాయం చేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకు కొరటాల ఇంటికొచ్చేసిన తరువాత.. ఇంట్లో ఇద్దరి ఫోన్లూ స్విఛాఫ్‌ చేసేసి.. చక్కగా ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తారట. సినిమాలు తీసే లైఫ్‌ కంటే తన పర్సనల్ లైఫ్‌ ఇంకా బాగుంటుందని కొరటాల చెప్పడం విశేషం. అందుకే ఇప్పుడు ఆయన సతీమణిని చూసి ఇనస్పయిర్ అయ్యి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారట. త్వరలో మహేష్‌ బాబు చేయబోయేది అదే క్యారెక్టర్ అంటున్నారు.

నిజజీవితం నుండి ఇన్సిపిరేషన్ తీసుకుని కొరటాల రూపొందిస్తున్న కమర్షియల్ సినిమాలు నిజంగానే చాలా బాగున్నాయి. మనోళ్లు తీసే మసాలా కమర్షియల్ సినిమాల్లో కాస్త డిఫరెంట్ గా ఉన్నాయనే పబ్లిక్ టాక్ కూడా. చూద్దాం మరి.. ఈసారి ఎటువంటి సినిమా తీస్తున్నాడో.