Begin typing your search above and press return to search.

ట్రెండింగ్‌: సుకుమార్ రైటింగ్స్ లో కొర‌టాల‌?

By:  Tupaki Desk   |   7 Feb 2021 11:00 AM IST
ట్రెండింగ్‌: సుకుమార్ రైటింగ్స్ లో కొర‌టాల‌?
X
సాటి ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించ‌డ‌మే కాదు.. అవ‌కాశం క‌ల్పిస్తే అత‌డి బ్యాన‌ర్ లో ఓ సినిమాకి ద‌ర్శకుడిగా ప‌ని చేస్తాన‌ని అన‌డం సంస్కారం మాత్ర‌మే కాదు.. ఎంతో గొప్ప స‌హృద‌య‌త‌ను ఆవిష్క‌రిస్తుంది. అలాంటి స‌న్నివేశ‌మే ఉప్పెన ప్రీఈవెంట్లో క‌నిపించింది. సుకుమార్ రైటింగ్స్ లో ఒక మూవీ చేయాల‌నుంద‌ని కొర‌టాల శివ అంత‌టి పెద్ద ద‌ర్శ‌కుడు వ్యాఖ్యానించారంటేనే ఆ బ్యాన‌ర్ కి ఉన్న క్రేజును సుకుమార్ అంటే ఉన్న గౌర‌వాన్ని అర్థం చేసుకోవాలి.

ఉప్పెన సినిమా చ‌క్క‌ని విజ‌యం సాధిస్తుంద‌న్న కొర‌టాల‌.. ఆ సినిమాని తెర‌కెక్కించిన బుచ్చిబాబు .. సుకుమార్ ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ``సాధారణంగా సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద పెర్ఫామెన్స్ గురించి తెలుసుకుంటాం. కానీ ఉప్పెన‌ ఇప్పటికే పెద్ద విజయాన్ని సాధించింది. దీని వెనుక ఉన్న వ్యక్తి బుచ్చి బాబు. అలాంటి ప్రతిభను తెచ్చిన ఘ‌న‌త‌ దర్శకుడు సుకుమార్ ‌కి ద‌క్కుతుంది`` అని కొరటాల అన్నారు. ఉప్పెన స్క్రిప్ట్ ను సుమారు నాలుగైదు గంటల పాటు వివరించాడు బుచ్చిబాబు. ప్రతి సన్నివేశానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అది `ఉప్పెన‌` ను గొప్ప చిత్రంగా తీయడంలో అతని అభిరుచిని ఆవిష్క‌రిస్తుంది అని కొర‌టాల అన్నారు.

నాయ‌కానాయిక‌లు పంజా వైష్ణవ్ తేజ్- కృతి శెట్టి పైనా కొరటాలా ప్రశంసలు కురిపించారు. ఆసి - బాబమ్మలుగా వైష్ణవ్ - కృతి మాత్రమే చేయగలరు. ఒకే ఒక్క విజయ్ సేతుపతి రాయణం (విల‌నీ) పాత్రకు స‌రిపోతారు. విజయ్ సేతుపతి మన మధ్య ఉన్నందుకు ఇది ఒక గౌరవం అని ప్ర‌శంసించారు. మైత్రికి మాత్ర‌మే ఇలాంటి గొప్ప సినిమా సాధ్య‌మ‌ని బ్యాన‌ర్ విలువ‌ను పెంచుతూ పొగిడేశారు కొర‌టాల‌.