Begin typing your search above and press return to search.

కొరటాలకి ఈ సారి వెయింటింగ్ తప్పదుగా!!

By:  Tupaki Desk   |   30 Jun 2016 9:00 PM IST
కొరటాలకి ఈ సారి వెయింటింగ్ తప్పదుగా!!
X

టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ. రెండే సినిమాలు.. రెండింటితోనూ ఆ హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్ లు ఇచ్చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ చిత్రానికి.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ కంటే చాలా ఎక్కువగా బిజినెస్ జరిగింది. ఈ అడిషనల్ మార్కెట్ అంతా కొరటాలను బేస్ చేసుకునే అనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పటికే గ్యారేజ్ కి టాకీ పూర్తయిపోగా.. మరో నెలన్నరలో విడుదల కూడా అయిపోనుంది.

మరి దీని తర్వాత కొరటాల చేయబోయే సినిమా ఏది? ఎవరితో చేస్తాడు? ఎన్టీఆర్ మూవీ తర్వాత.. రామ్ చరణ్ తో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కానీ సినిమా చేయాలన్నది కొరటాల శివ ఆలోచన. ఈ దర్శకుడు ఆగస్ట్ నాటికి ఫ్రీ అయిపోతాడు కానీ.. వీళ్లిద్దరికీ ఆ ఛాన్స్ లేదు. ధృవ చిత్రాన్ని ఆ టైంకి చివరి దశకు తెచ్చినా.. ఆ వెంటనే సుకుమార్ తో చెర్రీ సినిమా చేయాల్సి ఉంది. అన్నీ ఓకే అయితే మారుతి సినిమా కూడా కంప్లీట్ చేయాలి. అప్పుడు కానీ కొరటాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు.

ఇక మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా కూడా జూలైలో ప్రారంభం కానుంది. ఇది పూర్తవడానికి కూడా ఫిబ్రవరి వరకూ పడుతుందని అంటున్నారు. దీని తర్వాత వెంటనే కొరటాలకు ఛాన్స్ ఇస్తాడో.. లేక పూరీతో అనుకున్న 'జన గణ మన' చిత్రానికి వెళతాడో చెప్పడం ఇప్పుడే కష్టం. ఏదైనా చేస్తున్న సినిమా రిజల్ట్ ఆధారంగానే ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఏడాది వరకూ వెయిట్ చేయక తప్పదు. అయితే.. కొరటాల-రామ్ చరణ్ సినిమా ఫిక్సయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం.. కొరటాల దగ్గర డీవీవీ దానయ్య ఇచ్చిన అడ్వాన్స్ ఉంది. చెర్రీ కూడా ఈ నిర్మాతకి ఓ సినిమా చేయాల్సి ఉందనే టాక్ ఉంది. మరి కొరటాల-చరణ్.. ఫిక్స్ అవచ్చేమో!