Begin typing your search above and press return to search.

కొరటాల.. రెండు సినిమాలు కన్ఫమ్

By:  Tupaki Desk   |   15 Jun 2016 10:27 AM IST
కొరటాల.. రెండు సినిమాలు కన్ఫమ్
X
మిర్చి లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌ బస్టర్ మూవీతో దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సంపాదించి.. ఇప్పుడు క్రేజీ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ రూపొందిస్తున్న డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడు చేయబోయే రెండు ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి సమాచారం బయటికి వచ్చింది. మిక్కిలినేని సుధాకర్ అనే కొరటాల ఫ్రెండు ఈ రోజు తన మిత్రుడికి శుభాకాంక్షలకు చెబుతూ.. ప్రింట్-వెబ్ మీడియాలో భారీ ప్రకటనలు ఇచ్చాడు.

ఈ సందర్భంగా ‘యువసుధ’ ఆర్ట్స్ బేనర్ మీద కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించాడు. పోస్టర్ మీద వీళ్లిద్దరి పేర్లు తప్ప ఇంకెవరివీ లేవు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా కొరటాల ఓ సినిమా చేస్తాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఆ ప్రాజెక్టేనా అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు ‘బ్రూస్ లీ’ సినిమాతో డీలా పడిపోయిన బడా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కూడా కొరటాలతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొరటాల దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయినట్లు చెబుతున్నారు. జులై ప్రథమార్ధంలోనే సినిమా పూర్తయ్యే అవకాశముంది. ఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ డేట్ లాక్ అయిన సంగతి తెలిసిందే.