Begin typing your search above and press return to search.

కొరటాల అతి విశ్వాసం... % తో నాలుగేళ్ల శ్రమ వృధా

By:  Tupaki Desk   |   1 May 2022 5:00 PM IST
కొరటాల అతి విశ్వాసం... % తో నాలుగేళ్ల శ్రమ వృధా
X
మిర్చి సినిమా తో దర్శకుడిగా మారిన రచయిత కొరటాల శివ మొదటి సినిమా తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లోనే మిర్చి చిత్రం బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది. అలా ఆయన చేసిన ప్రతి ఒక్క హీరోకు కూడా వారి వారి కెరీర్ లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాలను ఇచ్చిన ఘనత ఆయనకు దక్కింది. చేసిన ప్రతి సినిమా కూడా విజయం సాధించడంతో ఆచార్య విషయంలో ఆయన అంచనా తప్పి జీరో తో నిలిచాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆచార్య ముందు వరకు తన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా పారితోషికం విషయంలో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఆచార్య సినిమా ను ఆయన సన్నిహితుడు నిర్మించాడు. ఆయన వద్ద పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకునే విధంగా ఒప్పందం కుదిరిందట. భరత్ అనే నేను సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల పాటు కొరటాల శివ మరే సినిమాను చేయలేదు.

నాలుగేళ్ల పాటు ఆచార్య సినిమా కోసం సమయం ఖర్చు చేసిన కొరటాల శివ పారితోషికంగా తీసుకున్నది ఏమీ లేదు. సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో వాటా కావాలన్నాడట. ఇప్పుడు సినిమాకు వచ్చిన టాక్ నేపథ్యంలో లాభాలు ఏమో కాని కనీసం బ్రేక్ ఈవెన్‌ సాధించే పరిస్థితి లేదు. దాంతో కొరటాల శివ పారితోషికం జీరోగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అతి విశ్వాసంతో లాభాల్లో శాతం ను తీసుకోవాలనుక్న కొరటాల శివకు మిగిలింది శూన్యం.

ఆచార్య సినిమా కోసం కొరటాల శివ దాదాపుగా మూడు సంవత్సరాలు పని చేశాడు. నాలుగు సంవత్సరాల పాటు సమయం కేటాయించాడు. ఇన్నేళ్ల ఆయన శ్రమ వృదా గా పోయినట్లు అయ్యింది. వరుసగా బ్లాక్ బస్టర్ లు దక్కించుకున్న కొరటాల శివ మరీ ఇంత దారుణంగా ప్లాప్ అవ్వడం.. అది కూడా జీరో పారితోషికం విషయాన్ని ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.

కొరటాల శివ ఈమద్య కాలంలో ఇతర స్టార్ దర్శకులు చేసినట్లుగా ప్లాన్ చేసి లాభాల్లో వాటాను తీసుకోవాలనుకున్నాడు. కాని వారు కొంత మొత్తం పారితోషకంగా అందుకుని మిగిలినది లాభాల్లో వాటాలుగా తీసుకున్నారట. కాని కొరటాల మాత్రం అతి విశ్వాసంతో మొత్తం లాభాల్లో వాటా గానే తీసుకోవాలని భావించాడు. అది కాస్త తలకిందులు అయ్యి నాలుగేళ్ల శ్రమ వృధా అయ్యేలా చేసింది. ఎన్టీఆర్‌ 30 సినిమా విషయంలో కొరటాల శివ ఏ పద్దతిని పాటించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.