Begin typing your search above and press return to search.

క‌మెడియ‌న్ ప్లానింగ్ అదిరిందిలే..

By:  Tupaki Desk   |   12 Nov 2016 11:00 PM IST
క‌మెడియ‌న్ ప్లానింగ్ అదిరిందిలే..
X
‘గీతాంజ‌లి’ సినిమాతో క‌మెడియ‌న్ శ్రీనివాస‌రెడ్డి హీరో అవుతున్నాడంటే చాలామంది తేలిగ్గా మాట్లాడారు. అత‌నేంటి హీరో ఏంటి అని. ఐతే హీరోలా కాకుండా అందులో కీల‌క పాత్ర‌ధారి లాగా క‌నిపించి మెప్పించాడు శ్రీనివాస‌రెడ్డి. దాని త‌ర్వాత ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’తో పూర్తి స్థాయి హీరోగా మారాడు కానీ.. ఈ సినిమా విష‌యంలోనూ బిల్డ‌ప్పులేమీ లేకుండా చూసుకున్నాడు. ఈ సినిమాను మొద‌ట్నుంచి తెలివిగా ప్ర‌మోట్ చేస్తూ పాజిటివ్ బ‌జ్ తీసుకురావ‌డంలో శ్రీనివాస‌రెడ్డి అండ్ కో విజ‌యవంత‌మ‌య్యారు. ఇక్క‌డ ప్ర‌ధానంగా శ్రీనివాస‌రెడ్డి ప్లానింగ్ క‌నిపిస్తోంది.

ఇండ‌స్ట్రీలో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో మంచి టైమింగ్ చూసి.. ఒక్కో సంద‌ర్భానికి ఒక్కో స్టార్ డైరెక్ట‌ర్ని ప్ర‌మోష‌న్ కోసం తీసుకురావ‌డంలో శ్రీనివాస‌రెడ్డి స‌క్సెస్ అయ్యాడు. ముందు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేయించాడు. ఆ త‌ర్వాత సుకుమార్ ను తీసుకొచ్చి టీజ‌ర్ లాంచ్ చేయించాడు. ఇప్పుడు మ‌రో అగ్ర ద‌ర్శ‌కుడిని త‌న సినిమా కోసం తీసుకొస్తున్నాడు శ్రీనివాస‌రెడ్డి. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు.. హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో జోరుమీదున్న కొర‌టాల శివ‌. ఆదివారం కొర‌టాల చేతుల మీదుగా ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. ఇలా స‌మ‌యానుకూలంగా సినిమాను ప్ర‌మోట్ చేస్తుండ‌టం.. ప్రోమోస్ కూడా బాగుండ‌టం వ‌ల్లే చిన్న సినిమా అయినా.. ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ రూ.7 కోట్ల‌కు బిజినెస్ చేసింది. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/