Begin typing your search above and press return to search.
కొరటాల టార్గెట్.. 10 బ్లాక్ బస్టర్లు
By: Tupaki Desk | 7 Sept 2016 7:00 AM ISTకెరీర్ మొత్తంలో ఓ పది బ్లాక్ బస్టర్లు ఇవ్వాలన్నది తన టార్గెట్ అంటున్నాడు కొరటాల శివ. తన దగ్గర ముందే అందుకు తగ్గ పది కథలు రెడీగా ఉన్నాయని కొరటాల చెప్పాడు. తొలి మూడు సినిమాలు తన అంచనాలకు తగ్గట్లే ఆడాయని.. ఇంకో ఏడు బ్లాక్ బస్టర్ల లక్ష్యమూ అందుకునే దిశగా పని చేస్తానని కొరటాల చెప్పాడు. ‘‘నా దగ్గర ఇంకో ఏడు కథలున్నాయి. పది బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని ఉంది. అందుకే రిలాక్స్ గా తీస్తున్నా. మూడు సినిమాల వరకు ఎలాంటి కాంప్లికేషన్ లేదు. రాంగ్ స్టెప్ వేయలేదు. పొరపాటున వేసినా అది చిన్న రాంగ్ స్టెప్ గానే ఉండాలనుకుంటున్నా. ఇప్పటిదాకా నేను చేసిన మూడు సినిమాలతోనే రావాల్సిన దానికన్నా ఎక్కువ పేరే వచ్చింది అని కొరటాల చెప్పాడు.
ఇప్పటిదాకా తనకు నిర్మాతలతో ఎలాంటి ఇబ్బందీ రాలేదని.. అదృష్టం కొద్దీ తనకు దొరికిన నిర్మాతలందరూ స్నేహితులే అని.. రెండు బ్యానర్లూ తన సినిమాలతోనే మొదలవడంతో అన్నీ తనే చూసుకున్నానని.. నటీనటుల ఎంపిక దగ్గర్నుంచి అన్ని నిర్ణయాలూ తనే చూసుకున్నానని కొరటాల చెప్పాడు. ‘శ్రీమంతుడు’కు మహేష్ కారు ఇచ్చినట్లు.. ‘జనతా గ్యారేజ్’కు సంతోషించి ఎన్టీఆర్ ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నాడా అని అడిగితే.. సినిమా ఇంత పెద్ద హిట్ కావడమే పెద్ద గిఫ్ట్ అని.. అది చాలు అని అన్నాడు. హాలీవుడ్ స్థాయిలో పెద్ద స్థాయిలో సినిమాలు తీయాలన్నది తన లక్ష్యమని కొరటాల చెప్పాడు. తనకు సినిమాలపై మంచి అవగాహన వచ్చే సమయానికి మణిరత్నం అంటే పిచ్చి అని.. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాని ప్రభావం తనపై ఎక్కువ ఉంటోందని కొరటాల తెలిపాడు