Begin typing your search above and press return to search.
సినిమాలు చేయకున్నా కొరటాలకు ఆగని ఆదాయం
By: Tupaki Desk | 30 Jun 2020 1:00 PM ISTభరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల ఇప్పటి వరకు తదుపరి సినిమాను విడుదల చేయలేదు. ఆ సినిమా అయిన వెంటనే చిరంజీవితో సినిమా ఖరారు అయ్యింది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం అయ్యింది అనుకుంటున్న సమయంలో మహమ్మారి వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అంటే కొరటాలకు రెండు సంవత్సరాలకు పైగా వృధా అయ్యింది. అయినా కూడా కొరటాలకు ఈ సమయంలో కూడా ఆదాయం వస్తుందట.
దర్శకుడు కొరటాల మొదట రచయిత. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచన సహకారం అందించిన ఘనత ఆయనది. అలాంటి కొరటాల వద్దకు ఎప్పుడు ఎవరో ఒక నిర్మాత కథ సలహాల కోసం లేదంటే స్క్రిప్ట్ మార్పులు చేర్పుల కోసం వస్తూ ఉంటారు. ఆచార్య ఆగిపోయిన గ్యాప్ లో కూడా కొరటాల వద్దకు చాలా స్క్రిప్ట్ లు వచ్చాయట. ప్రముఖ నిర్మాణ సంస్థ తాము నిర్మించే సినిమాల అన్నింటికీ కూడా కొరటాల సలహాలు మరియు మార్పులను పొందుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను భారీ మొత్తం ను కొరటాలకు ఇచ్చినట్లుగా టాక్.