Begin typing your search above and press return to search.
స్వచ్చందంగా రెమ్యూనరేషన్ తగ్గించుకున్న మెగా డైరెక్టర్!!
By: Tupaki Desk | 24 July 2020 8:00 AM ISTగత నాలుగు నెలల నుండి కరోనా మహమ్మారి కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగింది. ముఖ్యంగా థియేటర్ల యాజమాన్యం నుండి నిర్మాతల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సంక్షోభం నుండి నష్టాలలో నిర్మాతలను గట్టెక్కించడానికి సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరూ తమ పారితోషికాలను తగ్గించుకోవాలి. అందులోను మొదటగా సినిమాకి పెట్టే బడ్జెట్లు, అందరి వేతనాలను తగ్గించాలి. కొంతకాలం క్రితం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతిపాదించిన వేతనంలో 25% స్టార్ హీరోలు మరియు దర్శకులు తగ్గించాలి. కానీ ఈ ప్రాతిపదికను పట్టించుకునే నటులు, దర్శకులు పాటించేవారు గాని.. వారికి తెలియజేసే నిర్మాతగాని ఎవరూ లేరు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకులలో ఒకరు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు. నిర్మాతలు అడగక ముందే.. కొరటాల శివ స్వచ్ఛందంగా సినిమా కోసం తన వేతనం తగ్గించాలని నిర్మాతలను కోరారు. ఈ చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ త్వరలో ఈ విషయం పై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే కొరటాల తన వేతనం ఎంత తగ్గించాలో ప్రస్తావించనప్పటికీ.. అనుకూలమైన ఒప్పందంతో తన పారితోషికం తగ్గించాలని నిర్మాతలను కోరాడట. అంతేగాక ఈ చిత్రం కోసం వర్కింగ్ డేస్ సంఖ్య కూడా తగ్గించే ప్రణాళికలో ఉన్నాడట.. అలా అయితేనే బడ్జెట్ సేవ్ అవుతుందని అంటున్నారు. అయితే కొరటాల శివ తీసుకున్న ఈ స్వచ్చందమైన నిర్ణయాన్ని ఆనందంగా స్వాగతిస్తున్నారు. ఈ క్లిష్టమైన సమయంలో టాలీవుడ్ నిర్మాతలకు దర్శకులు, నటుల నుండి మద్దతు కావాలని.. తమ పారితోషికాలను తగ్గించుకోవాలని పలువురు కోరుతున్నారు.