Begin typing your search above and press return to search.

కొరటాల కున్న మెగా సమస్య అదేనట!

By:  Tupaki Desk   |   30 July 2018 8:03 PM IST
కొరటాల కున్న మెగా సమస్య అదేనట!
X
సీనియర్ హీరోలందరి సినిమాలకు ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే సరైన హీరోయిన్ ను వెతకడం. న్యూ జెనరేషన్ టాప్ హీరోయిన్లందరూ దాదాపు పాతికేళ్ళలోపు ఉండడంతో 50+ హీరోలకు పెయిరింగ్ చేస్తే అదోలా కనిపించే అవకాశం ఉంది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లను పెయిరింగ్ చేస్తే క్రేజ్ ఉండదు. దాంతో డైరెక్టర్లకు హీరోయిన్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు కొరటాల శివకు అదే సమస్య ఎదురయిందట.

కొరటాల శివ తన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ ను పకడ్బందీగా రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు. దాంతో పాటుగా సినిమాలో నటించే హీరోయిన్ - ఇతర నటీనటులను కూడా పాత్రలకు తగ్గట్టు ఫైనలైజ్ చేసుకుంటున్నాడట. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ కు వెళ్తుంది కాబట్టి త్వరగా హీరోయిన్ ఫైనలైజ్ చేసి కాల్ షీట్స్ తీసుకోవడం ముఖ్యం. దీంతో చిరంజీవి తో రొమాన్స్ చేసే హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడట. కానీ చిరుకు సరైన జోడీని వెతకడం కొరటాలకు కష్టంగానే ఉందట. మరి మెగాస్టార్ కోసం ఎవరిని తీసుకొస్తాడో వేచి చూడాలి.

ఈ సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ - నిరంజన్ రెడ్డి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరటాల రెగ్యులర్ స్టైల్ లోనే ఈ సినిమా కూడా ఒక సోషల్ ఎలిమెంట్ తో పాటు ఫుల్ గా కమర్షియల్ టచ్ ఉంటుందని సమాచారం.