Begin typing your search above and press return to search.

అతడిని మహేష్ తిడతాడట.. కొడతాడట

By:  Tupaki Desk   |   3 Jun 2018 3:41 PM IST
అతడిని మహేష్ తిడతాడట.. కొడతాడట
X
టాలీవుడ్లో చాలా రిజర్వ్డ్ గా కనిపించే హీరోల్లో మహేష్ బాబు ఒకడు. కానీ వ్యక్తిగతంగా మహేష్ చాలా జోవియల్ గా ఉంటాడని.. అతను వేసే పంచులు మామూలుగా ఉండవని అంటారు సన్నిహితులు. ఇండస్ట్రీలో మహేష్ కు సన్నిహితులు తక్కువ మందే. కానీ వాళ్లతో అతను చాలా క్లోజ్ గా ఉంటాడని అంటారు. అలాంటి వ్యక్తుల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ పప్పు కూడా ఒకడట. అతడిని మహేష్ తిడతాడట.. కొన్నిసార్లు కొట్టను కూడా కొడతాడట. వాళ్లిద్దరూ అంత క్లోజ్ అట. ఈ విషయాన్ని మహేష్ తో ‘శ్రీమంతుడు’.. ‘భరత్ అనే నేను’ సినిమాలు తీసిన కొరటాల శివనే వెల్లడించాడు. ఈ నెల 10న డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ 25 వసంతాల వేడుకలు అన్నపూర్ణా స్టూడియోలో ఘనంగా చేయబోతున్నారు. ఈ వేడుకలకు పప్పునే ఇన్ ఛార్జ్ అట. ఈ వేడుకలకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నాడట.

ఈ నేపథ్యంలో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కొరటాల ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా పప్పుతో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా తాను తీసిన నాలుగు సినిమాలకూ పప్పునే డబ్బింగ్ ఇన్ఛార్జ్ అని.. తను చాలా కేర్ తీసుకుని పని చేసేవాడని కొరటాల చెప్పాడు. ముందు మూడు సినిమాలకు పప్పు తనను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని.. కానీ ‘భరత్ అనే నేను’ టైంలో మాత్రం ఎప్పుడూ తమ సిల్వర్ జూబ్లీ వేడుకల గురించే ఆలోచిస్తూ ఉండేవాడని.. దాని గురించే మాట్లాడేవాడని.. నా టెన్షన్లో నేనుంటే ఇతడి గోలేంటని తాను అనుకునేవాడినని కొరటాల చెప్పాడు. మహేష్ బాబుకు పప్పు చాలా క్లోజ్ అనే విషయం తనకు తెలియదని.. పప్పు కూడా చెప్పలేదని.. కానీ మహేష్ చెప్పాక కానీ వాళ్ల సాన్నిహిత్యం గురించి తెలియలేదని.. అతడిని తాను తిడతానని.. కొడతానని మహేషే చెప్పాడని కొరటాల వెల్లడించాడు. డబ్బింగ్ ఆర్టిస్టుల సిల్వర్ జూబ్లీ వేడుకలకు తప్పకుండా వెళ్లమని తానే స్వయంగా మహేష్ బాబుకు చెప్పినట్లు కొరటాల తెలిపాడు.