Begin typing your search above and press return to search.

బాలయ్యతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అగ్ర దర్శకుడు..?

By:  Tupaki Desk   |   17 Nov 2021 11:00 PM IST
బాలయ్యతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అగ్ర దర్శకుడు..?
X
'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రచయిత కొరటాల శివ.. ప్రస్తుతం ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి హిట్ కొట్టడంతో కొరటాల దిట్ట. ఇదే పంథాలో ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్నారు. 'శ్రీమంతుడు' 'భరత్ అనే నేను' 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు 'ఆచార్య' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పనులన్నీ కానిచ్చేసిన కొరటాల శివ.. ఇప్పుడు తదుపరి స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తారక్ సినిమా తర్వాత కొరటాల ఓ మల్టీస్టారర్ మూవీ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' 'భీమ్లా నాయక్' 'ఎఫ్ 3' 'బంగార్రాజు'.. ఇలా రాబోయే రెండు నెలల్లో మరికొన్ని క్రేజీ మల్టీస్టారర్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఆచార్య' కూడా ఒక విధంగా మల్టీస్టారరే. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణతో కొరటాల ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే స్టోరీ లైన్ రెడీ చేసిన కొరటాల.. ఇందులో బాలయ్యతో పాటుగా మరో హీరోకి కూడా స్థానం కల్పించారట. ఇంకో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి బాలకృష్ణ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. దీంతో కచ్చితంగా ఓ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే నందమూరి హీరోతో పాటుగా కొరటాల ఏ హీరోని వెండితెర మీదకు తీసుకొస్తారో చూడాలి.