Begin typing your search above and press return to search.

కొరటాలకు సంబంధించి రెండు విషాదాలు

By:  Tupaki Desk   |   5 Sept 2016 3:00 PM IST
కొరటాలకు సంబంధించి రెండు విషాదాలు
X
కొరటాల శివ.. ప్రస్తుతం తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి తర్వాతి స్థానం అతడితే. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తక్కువ కాకుండా పారితోషకం తీసుకునే లెవెల్ అతడిది. ఇంత గొప్ప స్థితిలో ఉన్న కొరటాల జీవితంలో రెండు బాధాకరమైన విషయాలున్నాయట. అందులో ఒకటి తల్లికి సంబంధించి అయితే.. ఇంకోటి బిడ్డలకు సంబంధించింది. తన తల్లి తన కోసం ఎంతో కష్టపడిందని.. కానీ తాను దర్శకుడిగా సక్సెస్ చూసే సమయానికి ఆమె లేదని చెప్పాడు కొరటాల. ఇక బిడ్డల విషయానికి వస్తే అతడికి ఇంకా పిల్లలు లేరట. కొరటాల భార్యకు రెండుసార్లు మిస్ క్యారేజ్ అయ్యిందట.

‘‘దర్శకుడిగా నా తొలి సినిమా ఓకే కావడం నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు. అమ్మ చనిపోవడం అత్యంత బాధాకరమైన సంఘటన. ఆమె నా సక్సెస్‌ చూడలేదు. ఎంజాయ్‌ చేయలేదు. పొద్దునే లేచి మమ్మల్ని రెడీ చేసి ఆఫీసుకి పరుగెత్తేది. అలా పాతికేళ్లు కష్టపడింది. రిటైరయ్యాక చనిపోయింది. సుఖపడాల్సిన సమయంలో వదిలి వెళ్లిపోయింది. నేను దర్శకుడయ్యానని ఆమెకు తెలుసు. కానీ మిర్చి సినిమా విడుదలకు ముందే చనిపోవడం బాధనిపించింది. నా పెళ్లి విషయానికి వస్తే.. నేను రచయితగా ఉన్నప్పుడు ఆమె కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైంది. నచ్చిందని వెంటనే చెప్పేశా. పెళ్లి చేసుకుంటాననడంతో వాళ్ల ఇంట్లో చెప్పేసింది. వాళ్లు కూడా ఒప్పేసుకున్నారు. నా పెళ్లి కూడా సింపుల్ గా జరిగింది. ఇంకా పిల్లలు లేరు. రెండుసార్లు మిస్‌ క్యారేజ్‌ అయింది. పిల్లలు లేకుండా సర్వీస్‌ చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాం. మారి చిన్న కుటుంబం. బంధువులు తక్కువే. అన్నయ్య కూడా ఎప్పుడో ఒకసారి వస్తారు. నా భార్య వాళ్లది చాలా పద్ధతైన కుటుంబం. వాళ్లు రామకృష్ణ పరమహంసకు హార్డ్‌ కోర్‌ ఫాలోవర్స్‌’’ అని కొరటాల చెప్పాడు.