Begin typing your search above and press return to search.

కొరటాల ఉక్కిరి బిక్కిరి

By:  Tupaki Desk   |   27 Sept 2015 1:04 PM IST
కొరటాల ఉక్కిరి బిక్కిరి
X
రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ లు సాధారణంగా చాలా స్పీడు మీదుంటారు. రెగ్యులర్ డైరెక్టర్ల కంటే స్పీడుగా స్క్రిప్టు పూర్తి చేస్తారు. కమిట్ మెంట్ లు కూడా స్పీడుగా ఉంటాయి. కానీ కొరటాల శివ వాళ్లందరికీ భిన్నం. మనోడు మొదట్నుంచి ఆచితూచి అడుగేస్తున్నాడు. హడావుడి పడట్లేదు. మిర్చి సినిమా అంత పెద్ద హిట్టయినా.. మళ్లీ అతను రెండో సినిమా మొదలుపెట్టడానికి ఏడాది పైనే పట్టింది. ఇప్పుడు ‘శ్రీమంతుడు’ తర్వాత అతడి కోసం హీరోలు - నిర్మాతలు వెంటపడుతున్నా అతను మాత్రం తొందర పడట్లేదు. తన తర్వాతి సినిమాను కన్ఫమ్ చేయట్లేదు. ఐతే నిర్మాతలు, హీరోలు మాత్రం అతణ్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నట్లు సమాచారం.

మిర్చి తర్వాత కొరటాలకు అడ్వాన్స్ ఇచ్చిన బండ్ల గణేష్.. మూడో సినిమా తనకే చేయాలని పట్టుదలతో ఉన్నాడట. అఖిల్ ను లైన్ లో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. మరోవైపు ‘శ్రీమంతుడు’ నిర్మాతలైన మైత్రీ మూవీస్ అధినేతలు సైతం కొరటాలను వదలట్లేదు. తమ బేనర్ లో రెండో సినిమా కూడా మీరే చేయాలంటూ అతడిపై ఒత్తిడి తెస్తున్నారట. డైరెక్టర్లు ఫిక్సవకుండానే ఎన్టీఆర్‌ - పవన్ కళ్యాణ్‌ లకు అడ్వాన్స్ ఇచ్చేసిన నిర్మాతలు కొరటాల మీదే ఆశతో ఉన్నారట. ఎన్టీఆర్ - అఖిల్ ఇద్దరూ కూడా కొరటాలతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అతడితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐతే అందరూ వెంటపడ్డం బాగానే ఉంది కానీ.. కొరటాల మాత్రం ఇంతవరకు తన తర్వాతి సినిమాకు కథంటూ మొదలుపెట్టలేదని సమాచారం. మరి కొరటాల తర్వాతి సినిమాకు ఎలాంటి కాంబినేషన్, కథ కుదురుతుందో చూడాలి.