Begin typing your search above and press return to search.
కొరటాలకు అలా కలిసొచ్చేస్తుందంతే..
By: Tupaki Desk | 15 Aug 2016 1:18 PM ISTదర్శకుడిగా మిర్చి సినిమాతో స్టార్ డైక్రెక్టర్ల సరసన చేరిపోయిన కొరటాల శివ.. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా "శీమంతుడు" సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మహేష్ కేరీర్ లోనే ఒక బెస్ట్ మూవీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయంలో మహేష్ స్టామినా - కొరటాల దర్శకత్వ ప్రతిభతో పాటు ఊరులు / గ్రామాలు దత్తత అనే కాన్సెప్ట్ ఫుల్ గా సపోర్ట్ చేసిందనే చెప్పుకోవాలి. అయితే కేంద్రప్రభుత్వం గ్రామాల దత్తత అనే కార్యక్రమం ఈ సినిమా మొదలయ్యేనాటికే మొదలుపెట్టినా.. అప్పటికి దానికి అంత ప్రచారం జరగలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండి - విడుదలయ్యే మధ్యకాలంలో ఈ దత్తతపై ఫుల్ ప్రచారం జరిగింది. ఇదే సమయంలో సేం కాన్సెప్ట్ తో శ్రీమంతుడు రిలీజ్ అయ్యింది. దీంతో సినిమా ఎలాగూ కమర్షియల్ హిట్ అవ్వడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే సబ్జెక్ట్ ల లిస్టులో చేరిపోయింది.
ఈ సినిమా విడుదల అనంతరం మహేష్ బాబు - ప్రకాశ్ రాజ్ మొదలైన సెలబ్రెటీలు నిజంగానే కొన్ని పల్లెలను దత్తత తీసుకోవడంతో అటు ప్రచారానికి కూడా ఫుల్ హెల్ప్ అయ్యింది. దీంతో శ్రీమంతుడు సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపేసింది. అయితే ఇది కొరటాల ప్లానా లేక అనుకోకుండా జరిగిందా అనే విషయంపై అప్పుడు చర్చోపచర్చలు జరిగాయి. అయితే వీరిలో ఎక్కువమంది రెగ్యులర్ గానే రాసుకున్న కథకి అనుకోకుండా అలా టైం కలిసొచ్చిందని అనుకున్నారు.
అయితే తాజాగా కొరటాల చిత్రం "జనతా గ్యారేజ్" విషయంలోనూ కొరటాల మంచి టైమింగ్ తోనే కథరాశాడని అంటున్నారు సినీజనాలు. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం "హరిత హారం" - ఆంధ్రలో మొక్కా - నీరు అనే కార్యక్రమాలు మొదలుపెట్టి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలకు రాజకీయ సినీ ప్రముఖులు - క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాలకు ఫుల్ పబ్లిసిటీ కల్పించారు. ఇది కూడా గెస్ తో జరిగిందా - లేక అదృష్టం కొద్దీ అలా కలిసొచ్చిందో కానీ... మొక్కల పెంపకంపై పెద్ద చర్చ నడుస్తున్న సమయంలోనే "జనతా గ్యారేజ్" కూడా విడుదలకానుంది. నిజంగా చెప్పాలంటే.. ఈ సినిమా మొదలయ్యేనాటికి ఈ హరితహారం కార్యక్రమం మొదలేకాలేదు. అయితే.. కొరటాలకు ఈ విషయం ముందే తెలిసి రాశాడా లేక అలా కలిసొచ్చేసిందా అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ఏది ఏమైనా... ఒక పక్క సమాజానికి ఉపయోగపడే కాన్సెప్టులతో కథలను ఎంచుకుంటూ కమర్షియల్ హిట్ సినిమాలు తీస్తున్నాడు కొరటాల.