Begin typing your search above and press return to search.

బాలయ్య.. తారక్ కాంబినేషన్ అలా మిస్ అయ్యిందట

By:  Tupaki Desk   |   15 Jan 2020 10:28 AM IST
బాలయ్య.. తారక్ కాంబినేషన్ అలా మిస్ అయ్యిందట
X
కొన్ని కాంబినేషన్లు మహా క్రేజీగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. ఈ ఫ్యామిలీలో సీనియర్ నటుడైన బాలకృష్ణ.. యంగ్ తరంగ్ ఎన్టీఆర్ (తారక్) కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? వినేందుకే ఆసక్తికరంగా ఉన్న ఈ కాంబినేషన్ సరిగ్గా వర్క్ వుట్ చేస్తే.. భారీ సినిమా మారటం ఖాయం.

వాస్తవానికి ఈ కాంబినేషన్ ను వాస్తవరూపంలోకి తెచ్చే ప్రయత్నం గతంలో జరిగిందట. కాకుంటే.. ఇమేజ్ చట్రంలో నుంచి తమ అభిమాన నటుల్ని చూసే అలవాటున్న తెలుగు ప్రేక్షకులు ఈ కాంబినేషన్ వర్క్ వుట్ కాకుండా చేశారట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివనే చెప్పుకొచ్చారు. బాలయ్య.. తారక్ కలిసి చేసే సినిమా అంటే.. అందులో రెండు పాత్రలకు ప్రాధాన్యత సమంగా ఉండటంతో పాటు.. మరికొన్ని లెక్కలు చప్పున వస్తాయి. ఇదే ఆలోచన.. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ ను తెరకెక్కుండా అడ్డుకుందట.

2016లొ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ చేసిన పాత్రను తొలుత బాలయ్యతో చేయాలనుకున్నారట. అయితే.. ఈ చిత్రంలో కథలో నటులు ఇమిడిపోవాల్సి ఉంటుంది. నటులకు ఉన్న ఇమేజ్ మిస్ కాకూడదన్న లక్ష్యంతో సినిమా తీస్తే కథను చాలానే మార్చాల్సి ఉంటుంది. అదే జరిగితే.. సినిమా మరోలా మారుతుంది. జనతాగ్యారేజీ చిత్రం కథలో నటులు ఇమిడిపోవాలే తప్పించి.. నటులకు తగ్గట్లు కథను మార్చలేని పరిస్థితి.

ఈ కారణంతోనే మోహన్ లాల్ పాత్రను తొలుత బాలయ్యను అనుకున్నా.. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమేం వస్తాయన్న విషయాన్ని లెక్క వేసుకున్న తర్వాత బాలయ్యకు బదులు మోహన్ లాల్ ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయినట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిమితి.. రానున్న రోజుల్లోనూ తప్పదు. తమ ఇమేజ్ కు భిన్నమైన పాత్రలు చేసేందుకు టాలీవుడ్ అగ్ర నటులు రెఢీ అయితే తప్పించి.. ఇలాంటి కాంబినేషన్లు వాస్తవ రూపం దాల్చవని చెప్పక తప్పదు.