Begin typing your search above and press return to search.
కొరటాల ఆదేశించాడు.. మహేష్-ఎన్టీఆర్ పాటించారు
By: Tupaki Desk | 8 April 2018 10:15 AM ISTరాజకీయ నాయకులు తెల్లటి దుస్తులే వేస్తారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ సినిమా తీసిన కొరటాల శివ ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు డ్రెస్ కోడ్ పెట్టాడంటే.. అవి తెల్లటి దుస్తులే అయి ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఆశ్చర్యకరంగా బ్లూ కలర్ షర్టు వేయాలన్నది కోడ్ గా పెట్టడం విశేషం. ఈ ఈవెంట్ కు చిత్ర బృందంలోని చాలామంది బ్లూ షర్టుతోనే వచ్చారు. స్వయంగా తాను బ్లూ కలర్ చొక్కాతో వచ్చాడు కొరటాల. ఎప్పుడూ చొక్కాలే వేసే మహేష్ బాబు.. ఈసారి ఆశ్చర్యకరంగా టీ షర్ట్ వేశాడు. ఐతే అది బ్లూ కలరే.
‘భరత్ అనే నేను’లో సీఎంగా ఫార్మల్ డ్రెస్సుల్లో మహేష్ మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి డ్రెస్సులోనే వస్తాడనుకుంటే జీన్స్.. టీషర్ట్ వేసుకొచ్చాడు. మామూలుగా మహేష్ టీషర్ట్ వేయడం అరుదు. బయటికి ఎప్పుడూ ఫార్మల్ షర్టుతోనే వస్తుంటాడు. అతను ఫ్యాషన్ మీద పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించడు. కానీ ‘భరత్ అనే నేను’ సినిమా కాన్సెప్ట్ ప్రకారం సినిమాలోని లుక్ తో వస్తాడనుకుంటు టీషర్టుతో వచ్చి ఆశ్చర్యపరిచాడు.
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రెస్ కోడ్ పాటిస్తూ బ్లూ షర్టు వేసుకొచ్చాడు. ఇంకా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా బ్లూ డ్రెస్ కోడ్ పాటించారు. ఐతే హీరోయిన్ కియారా అద్వానీకి ఈ విషయంలో సమాచారం లేదో ఏమో.. ఆమె మాత్రం వైట్ డిజైనర్ డ్రస్సులో హాజరైంది.