Begin typing your search above and press return to search.

ఫ్రెండుకోసం ఎన్టీఆర్‌ తో?

By:  Tupaki Desk   |   31 July 2018 12:44 PM IST
ఫ్రెండుకోసం ఎన్టీఆర్‌ తో?
X
ఫ్రెండు కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డేవాడే అస‌లైన ఫ్రెండు! ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్‌ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్‌!! ప్ర‌స్తుతం ఈ సూక్తిని నిజం చేయ‌బోతున్నాడు కొర‌టాల శివ‌. స్నేహం కోసం స్నేహితుడు కోసం అత‌డు ఇప్పుడు త‌న పాత క‌మిట్‌ మెంట్‌ ని ఫైన‌ల్‌ చేశాడు. తాను కెరీర్ ఆరంభం ఎదుర్కొన్న క‌ష్టాల్లో త‌న‌కు ఎంత‌గానో సాయ‌ప‌డిన స్నేహితుడు కం పంపిణీదారుడు సుధాక‌ర్ మిక్కిలినేని కోసం అన్ని క‌మిట్‌ మెంట్ల‌ను ప‌క్క‌న‌బెట్టి సినిమా చేయ‌బోతున్నాడు. సాధ్య‌మైనంత మేర ఇత‌ర క‌మిట్‌ మెంట్ల‌ను పోస్ట్ పోన్ చేసుకుని సినిమా చేస్తున్నాడు.

వాస్త‌వానికి `భ‌ర‌త్ అనే నేను` రిలీజ్ అనంత‌రం కొర‌టాల చేయాల్సిన సినిమా ఇదే. అయితే మ‌ధ్య‌లో మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల లైన్ ఓకే చేయ‌డం - అటుపై ఆ క‌థ‌పై కొర‌టాల క‌స‌ర‌త్తు చేయ‌డం వ‌గైరా మ్యాట‌ర్స్ ఫ్రెండు సుధాక‌ర్‌ ని కాస్తంత కంగారు పెట్టాయి. త‌న సినిమా ఏమ‌వుతుందోన‌ని దిగులు ప‌డ్డారాయ‌న‌. అయితే మెగాస్టార్ సినిమాని కొర‌టాల ఆప‌రు. అలాగ‌ని ఫ్రెండు సినిమాని అస‌లే ఆప‌రు. అందుకు త‌గ్గ‌ట్టే ప‌క్కాగా ప్ర‌ణాళిక‌లు రూపందించారు. మెగాస్టార్‌ తో కొర‌టాల సినిమా ఈ ఏడాది డిసెంబ‌ర్‌ లో మొద‌లై - 2019 ద‌స‌రా (అక్టోబ‌ర్‌)లో రిలీజ‌వుతుంది. అదే ఏడాది డిసెంబ‌ర్‌ లో ఫ్రెండు మిక్కిలినేని సుధాక‌ర్ సినిమాని ప్రారంభించేందుకు కొర‌టాల సంత‌కం చేసేశాడు. యంగ్ య‌మ ఎన్టీఆర్‌ తో సెట్స్‌ కెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం తార‌క్ త్రివిక్ర‌మ్‌ తో బిజీ. ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే రాజ‌మౌళితో సినిమాలో న‌టిస్తాడు. అటుపై కొర‌టాల‌- మిక్కిలినేనితో వ‌చ్చి జాయిన్ అవుతాడు. అదీ సంగ‌తి. సుధాక‌ర్ మిక్కిలినేనికి ఆప్తుడైన కొర‌టాల కెరీర్ ఆరంభం నుంచి ఎన్టీఆర్‌ తో జ‌ర్నీ చేశారు. తార‌క్ బృందావ‌నం కి మాట‌లు అందించారు. `జ‌న‌తా గ్యారేజ్‌` వంటి బంప‌ర్‌ హిట్‌ ని డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక నానీతో కొర‌టాల సినిమా అనేది ఇప్ప‌టికి లేన‌ట్టేన‌ని తెలుస్తోంది.