Begin typing your search above and press return to search.
బన్నీని వదిలేసి చిరు దగ్గరకెళ్ళాడా?
By: Tupaki Desk | 7 May 2018 7:10 PM ISTటాలీవుడ్ స్టార్ దర్శకుల్లో కొరటాల చేరిపోయాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మిర్చి సినిమాతోనే సరికొత్త ట్రెండ్ కలెక్షన్స్ సెట్ చేసిన ఈ దర్శకుడు శ్రీమంతుడు సినిమాతో స్టార్ డైరెక్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతి తక్కువ కాలంలో కేవలం నాలుగు సినిమాలతో ఎక్కువ క్రేజ్ అందుకున్న దర్శకుడిగా కొరటాల బ్రాండ్ మరింత స్ట్రాంగ్ గా అయ్యింది. భారత్ అనే నేను సినిమా హిట్ తరువాత ప్రతి ఒక్క స్టార్ హీరో ఇప్పుడు కొరటాల వైపే చూస్తున్నారు.
ఏ మంత్రం అవకాశం దొరికినా వదులోకోవద్దు అనేలా ఉన్నారు. కానీ కొరటాల మాత్రం తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. భరత్ అనే నేను సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు ఇంకా ఫైనల్ చేయకపోవడం గమనార్హం. గతంలో రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ చెలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పినా మళ్లీ క్యాన్సిల్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ దగ్గరకు వచ్చే సరికి దాదాపు ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయిందని టాక్ వచ్చింది. బ్యాక్ గ్రౌంఫ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు కూడా టాక్ రావడంతో అభిమానులు కూడా ఆ కాంబో పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఇప్పుడు వినిపిస్తోన్న మరో టాక్ ప్రకారం కొరటాల మెగా స్టార్ చిరంజీవి వైపు మల్లినట్లు తెలుస్తోంది. ఇటీవల మెగాస్టార్ భరత్ అనే నేను చూసి దర్శకుడిని స్పెషల్ గా అభినందించారు. అయితే పనిలో పనిగా కొరటాల తో కథ చర్చలు జరిపిన మెగాస్టార్ ఒక మంచి పాయింట్ ని కొరటాల నుంచి వినడంతో కథ పై కసరత్తులు చేయమని చెప్పారట. మరో మూడు నెలల వరకు ఏ పని పెట్టుకోకుండా కొరటాల స్క్రిప్ట్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కొరటాల దాదాపు అల్లు అర్జున్ తో ఫిక్స్ అయ్యి ఇప్పుడు మెగాస్టార్ వైపు మళ్లడంతో అందరూ షాక్ అవుతున్నారు.