Begin typing your search above and press return to search.
బాలయ్యతో కొరటాల.. ఫిక్స్ అయినట్లే...?
By: Tupaki Desk | 14 Nov 2021 3:00 PM ISTనందమూరి అందగాడు బాలక్రిష్ణ మంచి జోరు మీద ఉన్నారు. ఆయన ఏ ముహూర్తాన అఖండ మూవీకి ఓకే చెప్పారో కానీ నాటి నుంచే దశ తిరిగింది అంటున్నారు. నిజం చెప్పాలంటే గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ తరువాత బాలయ్యకు సరైన హిట్ లేదు. ఇక రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన రూలర్ మూవీ అయితే డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఒక దశలో బాలయ్య మార్కెట్ మీదనే అందరికీ సందేహాలు వచ్చేశాయి. అలాంటి బాలయ్య అచ్చి వచ్చిన డైరెక్టర్ బోయపాటితో కరెక్ట్ టైమ్ లో చేతులు కలిపి అఖండకు వీర లెవెల్ లో హైప్ తెచ్చాడు. అఖండ రిలీజ్ కాకుండానే ఆఫర్ల మీద ఆఫర్లు క్రేజీగా బాలయ్య ఒడిలో వచ్చి పడుతున్నాయి.
ఇపుడు టాప్ డైరెక్టర్ల్స్, సక్సెస్ ఫుల్ మేకర్స్ బాలయ్యతో మూవీస్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే ఫ్యాన్స్ లో ఎక్కడ లేని హుషార్ కలుగుతోంది. బాలయ్యతో గోపీచంద్ మలినేని జై బాలయ్య మూవీ తీస్తున్నాడు. ఈ మూవీ పక్కా మాస్ మసాలాగా తయారవుతోంది. హీరోయిన్ నుంచి విలన్, టెక్నీషియన్స్ వరకూ అంతా నంబర్ వన్ గానే ఉన్నారు. మైత్రీ మూవీస్ నిర్మాణం కావడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సిందే అంటున్నారు. దీంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు రానుంది.
ఇపుడు ఆశ్చర్యం ఏంటి అంటే మరో టాప్ డైరెక్టర్ కొరటాల శివ బాలయ్యతో మూవీ తీయబోతున్నాడన్న టాక్. బాలయ్య 107 మూవీ ఓపెనింగ్ కి వచ్చిన కొరటాల బాలయ్యతో చాలా క్లోజ్ గా గడిపాడు. కొరటాల ఇప్పటికి తీసిన సినిమాలు చూస్తే అన్నీ సూపర్ డూపర్ హిట్టే. మెగాస్టార్ తో ఆయన ఆచార్య మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. దీని తరువాత జూనియర్ ఎన్టీయార్ తో ఆయన మూవీ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఆ తరువాత లైన్ లో పెట్టింది బాలయ్య మూవీనే అంటున్నారు. నిజానికి బాలయ్య కొరటాల కాంబో ముందే ఫిక్స్ అవాలి. జనతా గ్యారేజి మూవీలో మోహన్ లాల్ పాత్రలో మొదట బాలయ్యనే అడిగారని టాక్ వచ్చింది. ఎందుకో కుదరలేదు.
కానీ ఇపుడు బాలయ్యతో పక్కా మాస్ సబ్జెక్ట్ నే మేసేజ్ తో అద్ది సూపర్ డూపర్ మూవీగా తేవడానికి కొరటాల చూస్తున్నారు అంటున్నారు. మరి ఇది ప్రచారంలో ఉన్న విషయం. ఇది నిజం కావాలని, తొందరలోనే కొరటాల బాలయ్య కాంబొలో అదిరిపోయే మూవీ రావాలని ఫ్యాన్స్ అయితే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ న్యూస్ అఫీషియల్ గా వచ్చే వరకూ అంతా వెయిట్ చేయాల్సిందే.