Begin typing your search above and press return to search.

కొరటాల మెగా రీ-ఎంట్రీ ఖాయమైందా?

By:  Tupaki Desk   |   2 May 2018 1:41 PM IST
కొరటాల మెగా రీ-ఎంట్రీ ఖాయమైందా?
X
మెగా క్యాంప్ లో మూవీ చేయడం.. ఏ దర్శకుడు అయినా కోరుకునే పాయింట్ అనడం అతిశయోక్తి కాదు. హీరోయిన్స్ మాత్రమే కాదు.. సక్సెస్ లు కంటిన్యూ చేస్తే..వరుసగా అందరు హీరోలతో చేసే ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా వెలుగుతున్న కొరటాల శివ.. గతంలోనే మెగా క్యాంప్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం కంటే ముందే రామ్ చరణ్ తో ఓ మూవీ ఖాయం చేసుకున్నాడు కొరటాల. అనౌన్స్ మెంట్ మాత్రమే కాదు.. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ అంతలోనే ప్లానింగ్స్ మారిపోయి.. ఆ ప్రాజెక్టు రద్దయింది. ఆ తర్వాత వరుసగా హిట్స్ కొడుతున్న కొరటాల శివ.. ఇప్పుడు మళ్లీ మెగా క్యాంప్ లోకి రీఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. తాజాగా మహేష్ తో భరత్ అనే నేను చిత్రం తీసి గ్రాండ్ సక్సెస్ కొట్టిన ఈ దర్శకుడు.. రీసెంట్ గా అల్లు అర్జున్ కు ఓ కథ వినిపించాడట.

ఇది కూడా కొరటాల స్టైల్ లోనే మెసేజ్ కం కమర్షియల్ ఎలిమెంట్స్ కంప్లీట్ గా క్యారీ చేసే సినిమా అని తెలుస్తోంది. స్టోరీ లైన్ తో పాటు కొరటాల నెరేషన్ పూర్తిగా నచ్చేయడంలో.. సినిమా చేసేందుకు వెంటనే ఓకే చెప్పేశాడట అల్లు అర్జున్. ప్రస్తుతం కొరటాల ఇంకా తన తర్వాతి ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. మరోవైపు నా పేరు సూర్య తర్వాత బన్నీ సినిమాపై క్లారిటీ లేదు. 4వ తేదీన నా పేరు సూర్య రిలీజ్ తర్వాత.. బన్నీ-కొరటాల కాంబోపై క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.