Begin typing your search above and press return to search.
కొరటాల కోటి ఖర్చుపెట్టాడా??
By: Tupaki Desk | 5 April 2017 4:09 PM ISTదర్శకుడుగా మారిన తరువాత ఇప్పటివరకు కొరటాల శివ మూడు సినిమాలు తీస్తే.. ఆ మూడు కూడా పెద్ద హిట్లే. అందుకే మిర్చి.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ సినిమాలను తీసినతరువాత మనోడికి బాగా డిమాండ్ పెరిగింది. అయితే ఈ మూడు సినిమాల తరువాత తన దగ్గర మరో ఏడు సినిమాలకు కథలు ఉన్నాయని చెప్పిన కొరటాల.. ఇప్పుడు మాత్రం ఒక బయట రైటర్ కథతో మహేష్ బాబు సినిమాను మొదలెడుతున్నాడు.
హీరోయిన్ భూమిక ప్రొడ్యూస్ చేసిన తకిట తకిట.. అలాగే ఆమె హీరోయిన్ గా రూపొందిన సత్యభామ వంటి సినిమాలతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు శ్రీహరి నాను. ఆ తరువాత ఈయన సినిమాలేవీ డైరక్ట్ చేయలేదు కాని.. ఇప్పుడు మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఒక కథ రాశాడు. దానిని ఎప్పుడైతే కొరటాల శివ కొనుక్కుంటా అన్నాడో.. మహేష్ బాబుతో ఆ సినిమాను చేద్దాం అనుకున్నాడో.. వెంటనే శ్రీహరి ఒక కోటి కోట్ చేశాడట. కథ బాగుంది కాబట్టి.. వెంటనే కోటి రూపాయలు ఇవ్వడానికి ఎగ్రిమెంట్ చేసుకున్నాడట కొరటాల.
ఈ మధ్యకాలంలో ఇలా హైప్ ఇచ్చిన కథలన్నీ కూడా చివరకు సింపుల్ గానే ఉంటున్నాయి. లేదంటే ఒక గొప్ప కథ అని చెప్పగానే వెంటనే కొందరు సీనియర్ రచయితలు అది మాదే అంటూ కేసులు పెడుతున్నారు. చూద్దం ''భరత్.. అను నేను'' కథ ఎలా ఉండబోతోందో మరి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వబోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/