Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాటలో కొరటాల పాత్ర ఏంటి..??

By:  Tupaki Desk   |   11 May 2022 2:30 AM GMT
సర్కారు వారి పాటలో కొరటాల పాత్ర ఏంటి..??
X
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో దూకుడుమీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

అయితే SVP చిత్రానికి పరశురాం దర్శకుడైనా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కు దీనికి లింక్ ఉందనే ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ప్రత్యక్షంగా కొరటాలకి ఎలాంటి పాత్ర లేదు కానీ.. పరోక్షంగా మాత్రం ఇందులో ఆయన కూడా భాగమే.

అదెలా అంటే సర్కారు వారి స్టోరీని మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌ కి కొరటాల సహాయం చేశారు. మహేష్ కు అభిమాని అయిన పరశురాం.. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని కథ రెడీ చేసుకున్నారు. అయితే దర్శకుడు దాన్ని హీరోకి వినిపించడానికి కొరటాల హెల్ప్ తీసుకున్నారు.

'శ్రీమంతుడు' 'భరత్ అనే నేను' వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తీసిన కొరటాల శివ కు మహేష్ బాబుతో మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేశ్ కోసం పరశురాం కథ రాశానని చెప్పగానే.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి తన వంతు సహాయం చేసారు కొరటాల. ఈ విషయాన్ని పరశురాం స్వయంగా వెల్లడించారు.

SVP ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా కొరటాల కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమా సాధ్యమైందని.. లేకపోతే మహేశ్ బాబును రీచ్ అవడానికి కాస్త ఎక్కువ టైం పట్టేదని పేర్కొన్నారు.

మహేశ్‌ బాబుకి కథ చెప్పడానికి ముందు తాను చాలా భయపడ్డానని.. మొదటి ఐదు నిమిషాల స్టోరీ నెరేట్ చేశాక ఆయన ఫేస్‌ పై ఓ చిరునవ్వు చూశానని.. తనని నమ్మి అవకాశం ఇచ్చినందుకు మహేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానని పరశురాం అన్నారు.

ఇలా ఇన్ డైరెక్ట్ గా 'సర్కారు వారి పాట' సినిమాలో కొరటాల శివ కూడా భాగం అయ్యారు. నిజానికి కొరటాల ఇతర హీరోలకు సినిమాలు సెట్ చేయడంలో సహాయం చేస్తుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే దర్శకుడు మాత్రం తన వద్దకు వచ్చిన వారికి తనవంతు సహాయం చేస్తుంటానని.. అంతకు మించి ఏమీ లేదని అంటున్నారు.

ఎన్టీఆర్ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో 'జై లవకుశ' సినిమా కుదరడం వెనుక కొరటాల శివ హ్యాండ్ ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తెలిపారు. తన 'జనతా గ్యారేజ్' హీరో తారక్ కోసం మంచి కథ రాసుకున్నానని బాబీ చెప్పడంతో.. తనవంతు హెల్ప్ చేశానని కొరటాల చెప్పారు.

ఇక కొరటాల విషయానికొస్తే.. మెగా తండ్రీకొడుకులతో తీసిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. NTR30 చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ప్రకటించబడతాయి.