Begin typing your search above and press return to search.

చిరు కోసం తప్పని ఎదురుచూపులు

By:  Tupaki Desk   |   3 July 2019 11:47 AM IST
చిరు కోసం తప్పని ఎదురుచూపులు
X
భరత్ అనే నేను వచ్చి ఏడాది దాటేసింది. కొరటాల శివ కొత్త సినిమా మొదలుకానే లేదు. చిరంజీవి 152 పోయిన సంవత్సరమే కన్ఫర్మ్ చేయడంతో అప్పటి నుంచే కథను సిద్ధం చేసుకుని ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న శివ ఇప్పుడిది ఎప్పుడు మొదలవుతోందోనని అంతులేని సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. సైరా ప్లానింగ్ ప్రకారం వెళ్లుంటే గత డిసెంబర్ లోనే పూర్తయ్యేది. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్న తరహాలో ఆలస్యం పెరుగుతూ పోయి ఏకంగా ఏడు నెలలు అదనంగా దాటేసింది.

ఇంత సమయమూ కొరటాల శివ వెయిటింగ్ లోనే ఉన్నాడు. ఈ గ్యాప్ లో కోరుకుంటే ఎంత పెద్ద హీరో అయినా డేట్స్ ఇచ్చేవాడు కానీ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడిదాకా వచ్చాడు. ఇప్పుడు సైరా ఫినిష్ అయ్యింది. అయినా 152 ముహూర్తం ఫిక్స్ కాలేదు. కారణం ఉందట. ఇప్పుడు తీయబోయే సినిమా కమర్షియల్ ప్లస్ మెసేజ్ ఓరియెంటెడ్. సైరా లుక్స్ సెట్ కావు. కొంత స్లిమ్ అవ్వాల్సి ఉంటుంది. రెండు షేడ్స్ కాబట్టి తేడా చూపించాలి అంటే ఫిజిక్ పరంగా మార్పులు చేసుకోవాలి. దీని కోసమే సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ ఇప్పటికే హైదరాబాద్ కు వచ్చాడు.

ఇంకో నెల రోజులు వర్క్ అవుట్ చేస్తే కథకు తగ్గ షేప్ వస్తుందని అందాకా వెయిట్ చేయమని చిరు కోరడంతో శివ ఏమి అనలేక ఓకే చెప్పినట్టు తెలిసింది. లేట్ అయినా సరే బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చిరు కూడా రాజీ పడకుండా ఈ వయసులో రిస్క్ అనిపిస్తున్నా వర్క్ అవుట్స్ కి రెడీ అవుతున్నట్టు వినికిడి. మెగా ఫాన్స్ సైరా మూడ్ లో ఉన్నారు కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టడం లేదు కానీ అదయ్యాక ఇదే టాక్ అఫ్ ది టౌన్ గా మారేలా ఉంది