Begin typing your search above and press return to search.
మహేష్ మూవీతో కొరటాలకు జాక్ పాట్!
By: Tupaki Desk | 9 Oct 2016 5:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే దర్శకులకు సగం పని తేలికయిపోతుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ముందస్తు కష్టాలు పెద్దగా ఏముండవు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మహేష్ సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉండడంతో.. సూపర్ స్టార్ తో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కట్టేస్తుంటారు. ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. తర్వాత కొరటాలతో ఓ మూవీ చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే.
శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్ కావడంతో.. ఇంకా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండానే క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. ఈ మూవీ కోసం కొరటాలకు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ పై ఇప్పుడు రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ సినిమాకు పారితోషికం రూపంలో కొరటాలకు ఓవర్సీస్ హక్కులు అందనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కనుక.. కొరటాలకు జాక్ పాట్ దక్కినట్లే అని చెప్పుకోవాలి. శ్రీమంతుడు మూవీ ఈ ఏరియాలో 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో ఇది 19 కోట్లకు సమానం.
బ్రహ్మోత్సవం నిరుత్సాహపరిచినా.. 2017 సెకండాఫ్ లో స్టార్ట్ అయ్యి 2018 స్టార్టింగ్ లో విడుదలకు ఛాన్స్ ఉండే సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ చాలా తక్కువే. సో.. కనీసం 17 కోట్ల రూపాయలు ఓవర్సీస్ రైట్స్ రూపంలో కొరటాలకు ముడతాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/