Begin typing your search above and press return to search.

10 కోట్ల క్లబ్ లో కొరటాల శివ

By:  Tupaki Desk   |   19 Feb 2016 12:05 PM IST
10 కోట్ల క్లబ్ లో కొరటాల శివ
X

తెలుగు సినీ ఇండస్ర్టీలో పెద్ద హీరోల హవా ఏ రేంజిలో ఉంటుందో తెలిసిందే. ఎవరైనా వారు చెప్పినట్లు వినాల్సిందే. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం వారి చేతిలోనే ఉంటుంది... వారి మాటే చెల్లుబాటవుతుంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే అయినా కొందరు దర్శకులు మాత్రం ఈ మధ్య కాలంలో దాన్ని బాగా వాడుకుంటున్నారట. హీరోలను పట్టుకుంటే మంచి రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను పట్టుకుని కొందరు దర్శకులు 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట.

తాజాగా పట్టాలు ఎక్కబోతున్న జనతా గ్యారేజ్ చిత్రం కోసం ఆ​​యన కొరటాల శివకు పది కోట్లు రెమ్యునేషన్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. నిర్మాతలు ఎనిమిది కోట్లు అంటే ఎన్టీఆర్ పట్టు పట్టి మరీ పది కోట్లు ఇప్పిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివకు నాలుగు కోట్లు రెమ్యునేషన్ తీసుకోగా.... జనతా గ్యారేజ్ కోసం శివ పది కోట్లు అడిగారట... అయితే, నిర్మాత ససేమిరా అనడంతో ఆయన ఎన్టీఆర్ ను ఆశ్రయించారు. దీంతో ఎన్టీఆర్ చెప్పడం.. నిర్మాత వినడం జరిగిపోయాయి... ఆ రకంగా శివ ఇప్పడు రూ.10 కోట్ల డైరెక్టరుగా మారారు. మూడో సినిమాకే ఇలా పది కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవటం మామూలు విషయమేమీ కాదు. ఈ స్దాయి రెమ్యునేషన్ ఇఫ్పటికే ఇండస్ట్రిలో రాజమౌళి, త్రివిక్రమ్, శ్రీను వైట్ల వంటి దర్శకులకు మాత్రమే ఉంది. ఇప్పుడు కొరటాల శివ కూడా ఆ క్లబ్ లో చేరారు.