Begin typing your search above and press return to search.

మెగా 152 : తెరపైకి మరో పేరు

By:  Tupaki Desk   |   27 Sep 2019 2:30 PM GMT
మెగా 152 : తెరపైకి మరో పేరు
X
చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సైరా విడుదలైన వెంటనే చిరంజీవి తన 152వ చిత్రంను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. సంవత్సరం నుండి వీరిద్దరి కాంబో మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ భరత్‌ అనే నేను చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని చిరు 152 చిత్రంను చేయబోతున్నాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ ఎప్పుడో పూర్తి చేసిన కొరటాల ప్రస్తుతం చిరుకు జోడీగా హీరోయిన్‌ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ అంటూ పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అందులో ముఖ్యంగా నయనతార.. కాజల్‌.. హ్యూమ ఖురేషి.. తమన్నాల పేర్లు ప్రచారం జరిగాయి. కాని ఈసారి కొత్తగా త్రిష పేరు కూడా ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ ఇటీవలే త్రిషను ఈ ప్రాజెక్ట్‌ విషయమై కలిసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే చాలా ఏళ్లుగా త్రిష తెలుగు సినిమా ప్రేక్షకులకు దూరంగా ఉంటుంది. ఆమెకు తెలుగులో సాలిడ్‌ సక్సెస్‌ దక్కక దాదాపు దశాబ్ద కాలం అయ్యింది. అయినా కూడా కొరటాల శివ ఆమెను చిరంజీవి కోసం అడిగినట్లుగా తెలుస్తోంది.

మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న త్రిష వెంటనే చిరు 152 చిత్రానికి ఓకే చెప్పిందట. చిరంజీవితో కలిసి 2006వ సంవత్సరంలో 'స్టాలిన్‌' చిత్రంలో త్రిష నటించింది. ఆ చిత్రంకు మంచి స్పందన వచ్చింది. ఇద్దరి జోడీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుంది. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్స్‌ పేర్లు పరిశీలించిన కొరటాల చివరకు త్రిష వద్దకు వెళ్లి ఎందుకు ఆగాడో ఆయనే చెప్పాలి.