Begin typing your search above and press return to search.
కొరటాల పంచ్.. టీజర్లోనే కాదు బయట కూడా
By: Tupaki Desk | 8 March 2018 11:42 AM ISTమన సినిమావాళ్లు సాధారణంగ సినిమాల్లో తెగ టాలెంట్ చూపించేసి.. ఇతర హీరోలపైనా తమ హీరోకు వ్యతిరేకులైన పొలిటికల్ పార్టీలపైనా తెగ పంచులు పేలుస్తుంటారు. అసలు నిజమైన రాజకీయం.. నీతి.. సన్మార్గం.. అంటే ఇది అన్నట్లు తెగ హంగామా చేస్తుంటారు. అయితే ఇదంతా నిజ జీవితంలో ఉంటుందా అంటే.. అబ్బే వెండితెర వేరు ఒరిజినల్ లైఫ్ వేరు అంటూ కలరింగ్ ఇస్తుంటారు. కాని దర్శకుడు కొరటాల శివ మాత్రం అలా కాదంటూ ఇవాళ చెప్పకనే చెప్పాడు.
నిజానికి భరత్ అను నేను విజన్ టీజర్ రాగానే.. అందులో ఒక 'ప్రామిస్' అనే కాన్సెప్టు బాగా నచ్చేసింది. ఇచ్చిన ప్రామిస్ ను ఒక మగాడిలా నిలబెట్టుకోవాలంటూ తన తల్లి తనకు నేర్పిందని హీరో క్యారక్టర్ చెబుతాడు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మగాడు అనిపించుకోవాలి అంటూ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి పంచ్ ఇచ్చాడు కొరటాల శివ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఉరఫ్ బిజెపి సర్కార్.. ఇప్పుడు స్టాటస్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కేవలం ప్యాకేజీ ఇస్తారట. ఇదే విషయంపై స్పందించిన కొరటాల.. తన మాటను నిలబెట్టుకుని మగాడు అనిపించుకోవాలి మోడి అని చెబుతూ.. తెలుగు రాష్ట్రాలు భారత దేశంలో భాగమే అని ఆయన మర్చిపోయారా అంటూ ట్వటేశాడు. యవాత్ నెటిజనులకు షాకిచ్చాడు.
మరి కొరటాల సరే.. ఆ పాత్రలో చేసిన మహేష్ బాబు వర్యులు.. అలాగే ఆ సినిమాలో ప్యాషనేట్ గా విజన్ చూపించిన ఇతరులు కూడా ఇప్పుడు నరేంద్ర మోడిని ఇదే తరహాలో డిమాండ్ చేస్తారా? వెయిట్ అండ్ సి.