Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ కు కొరటాల ఏం సలహా ఇచ్చాడంటే..

By:  Tupaki Desk   |   6 Sep 2016 11:30 AM GMT
క్రిటిక్స్ కు కొరటాల ఏం సలహా ఇచ్చాడంటే..
X
తొలి రోజు వచ్చిన టాక్ ను మించి భారీ వసూళ్లు సాధిస్తోంది ‘జనతా గ్యారేజ్’. సినిమా మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో తొలి రోజు ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి ఏవరేజ్ రేటింగులే ఇచ్చారు. ఐతే టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి ‘జనతా గ్యారేజ్’కు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫలితాన్ని అంచనా వేయడంలో క్రిటిక్స్ బోల్తా కొట్టారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని దర్శకుడు కొరటాల శివ సైతం సమీక్షకుల తీరును తప్పుబట్టాడు. అతనేమీ గట్టి విమర్శలు చేయలేదు కానీ.. విమర్శకుల తీరు మారాలన్నాడు. సినిమా అనేది కోట్ల రూపాయలతో ముడిపడ్డ వ్యవహారమని.. ఎంతోమంది కష్టం ఇందులో ముడిపడి ఉంటుందని.. కాబట్టి తొందరపడి సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదన్నారు.

క్రిటిక్స్ మీద తనకు గౌరవం ఉందని చెబుతూనే.. వారు రేటింగ్స్ ఇచ్చే ముందు థియేటర్ల దగ్గర తొలి రోజు తొలి షో చూసిన అభిమానుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటే మంచిదన్నాడు. ప్రేక్షకులతో సర్వే నిర్వహించాక రేటింగ్స్ ఇస్తే బాగుంటుందని అన్నాడు కొరటాల. కానీ క్రిటిక్స్ థియేటర్ల దగ్గర సర్వేలు చేయడం ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. అయినా ఫస్ట్ షో చూసే అభిమానుల్ని అడిగితే ఏం చెబుతారు. పాజిటివ్‌ గానే స్పందిస్తారు. దాన్ని బట్టి సమీక్షలు ఇచ్చినా తేడా రావచ్చు. అయినా ఇక్కడ సమీక్షకులు సినిమాల విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరైనవా కాదా.. అన్నది ఇక్కడ చర్చనీయాంశం.