Begin typing your search above and press return to search.
బెనిఫిట్ షోలపై కొరటాల సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 12 Sept 2016 1:11 PM ISTస్టార్ హీరో చిత్రాలకు బెనిఫిట్ షోలు వేస్తారు. రిలీజ్ రోజునే తెల్లారేసరికి తమ హీరో చిత్రాన్ని చూసేయాలని అభిమానులు ఉత్సాహపడుతూ ఉంటారు. అందుకే వేలకువేలు పెట్టి మరీ బెనిఫిట్ షో టిక్కెట్లు కొనుక్కుంటారు! అయితే, ఇలాంటి బెనిఫిట్ షోల వల్ల సినిమాకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా... అంటే, అవుననే అన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ. జనతా గ్యారేజ్ విడుదల అయిన తొలిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే. బెనిఫిట్ షో చూసి వచ్చినవారు కొంతమందైతే... ఈ సినిమా తారక్ కెరీర్ లో ఒక అబౌ ఏవరేజ్ అవుతుందనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే, ఈ అంచనాలన్నింటినీ పక్కకు నెట్టేసి రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది జనతా గ్యారేజ్. అంతేకాదు - విడుదలైన 8 రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు కొరటాల శివ.
జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో తరువాత వచ్చిన స్పందన చూసి తానూ కాస్త కంగారుపడ్డానని కొరటాల అన్నారు. బెనిఫిట్ షో అయిన వెంటనే కొన్ని నెగెటివ్ కామెంట్లు తనకీ వినిపించాయని చెప్పారు. అయితే, మార్నింగ్ షో తరువాత ఆ అభిప్రాయం మారిపోయిందనీ - సినిమా చూసినవారంతా చాలా బాగుంది అనడం మొదలుపెట్టారని వివరించారు. బెనిఫిట్ షోలన్నీ తెల్లవారుజామున 3 గంటలకు వేశారు - కాబట్టి విశ్లేషకులందరూ రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల ఈ సినిమా సరిగా అర్థం చేసుకోలేకపోయి ఉంటారనీ, అందుకే వారి అంచనాలు కాస్త తేడా వచ్చినట్టుగా తనకు అనిపించిందని అభిప్రాయపడ్డారు. కేవలం ఒక్క బెనిఫిట్ షోకి మాత్రమే అలాంటి నెగెటివ్ టాక్ వచ్చిందంటే కారణం... నిద్ర లేకుండా - బాగా అలసిపోయి ఉన్న స్థితిలో సినిమా చూడటమే అయి ఉంటుందని కొరటాల చెప్పుకొచ్చారు.
అంటే, బెనిఫిట్ షోల వల్ల సినిమాల ఇలాంటి ఇబ్బంది కూడా ఉంటుందా అనేట్టుగా కొరటాల వ్యాఖ్యానించారు. నిజానికి బెనిఫిట్ షోల పేరుతో కొంతమంది ఇష్టానుసారం టిక్కెట్టు రేట్లు పెంచేసి - క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. బెనిఫిట్ షోల విషయంలో కొరటాల చేసి వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం చూపుతాయో లేదో చూడాలి!