Begin typing your search above and press return to search.

కోటిచ్చి కథ కొన్న కొరటాల??

By:  Tupaki Desk   |   9 Dec 2016 7:30 PM GMT
కోటిచ్చి కథ కొన్న కొరటాల??
X
ఒకప్పుడు సినిమా టైటిల్స్ లో ఒక్కో డిపార్ట్ మెంట్ లో ఒక్కోక్కరి పేరు కనిపించేది. కథ ఒకళ్లది.. డైరెక్షన్ మరోకరిది ఉండేది. దాసరి నారాయణరావు లాంటి వాళ్లు తప్ప మెజార్టీ డైరెక్టర్స్ బయట రచయితల కథల్నే సినిమాలుగా తీసేవాళ్లు. అయితే ఈ మధ్య ట్రెండ్ మారిపోయింది. రైటర్సే దర్శకులు అయిపోతుండటంతో కథ- స్క్రీన్ ప్లే లాంటి క్రెడిట్స్ కూడా వాళ్లకే వెళ్లిపోతున్నాయ్. ఇప్పుడున్న దర్శకుల్లో కొరటాల శివ కూడా అంతే. స్వయంగా రచయిత కావడంతో సొంతంగానే కథ- మాటలు రాసుకుని డైరెక్షన్ కూడా చేసేస్తుంటాడు.

కొరటాల పెన్నుకి పవర్ ఎక్కువనే విషయం ఆయన తీసిన సినిమా రిజల్ట్సే చెబుతాయ్. రాజమౌళి తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన డైరెక్టర్ కొరటాలే. పవర్ ఫుల్ స్టోరీస్ ని అంతకన్నా పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసే కొరటాల శివ ఫస్ట్ టైం బయట కథ మీద మనసు పడ్డాడట. అవును మహేష్ తో తీయబోతున్న భరత్ అను నేను.. కథ కొరటాల బ్రైయిన్ ఛైల్డ్ కాదు. శ్రీహరి నాను అని ఇండస్ట్రీలో పెద్దగా ఫేమస్ కానీ రైటర్ కమ్ దర్శకుడున్నాడు. ఆయన దగ్గరున్న ఈ కథ నచ్చి కొరటాల వెంటనే కోటీ రూపాయలిచ్చి మరీ స్టోరీ కొనేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. .

శ్రీహరి నాను హర్షవర్థన్ రానే.. హరిప్రియ జంటగా తకిట తకిట అనే మూవీ తీశాడు. హీరోయిన్ భూమిక ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ చూడ్డానికి బానే ఉన్నా పెద్దగా ఆడలేదు. అయితే కొరటాల ఇవేవీ పట్టించుకోకుండా శ్రీహరి దగ్గరున్న కథలో పాయింట్ ఉండటంతో కళ్లు చెదిరే అమౌంటిచ్చి ఆయన స్టోరీని తన సొంతం చేసుకొన్నాడు. అల్రెడీ శ్రీమంతుడి స్టోరీ విషయంలో జరిగిన వివాదాలు గుర్తున్నాయనుకుంటా టైటిల్ క్రెడిట్ కూడా ఇస్తానని శ్రీహరికి మాట ఇచ్చాడట. మరి ఏ పాయింట్ నచ్చి శివ అంత టెంప్ట్ అయ్యాడో.. అసలు ఈ కథ కొనడం అనేది రూమరో నిజమో అనే విషయం.. కొరటాల శివే చెప్పాలి.