Begin typing your search above and press return to search.

కొరటాలకు కోపం తెప్పిస్తున్న నటుడు

By:  Tupaki Desk   |   8 Aug 2017 12:34 PM IST
కొరటాలకు కోపం తెప్పిస్తున్న నటుడు
X
టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ మరో భారీ హిట్ పై కన్నేశాడు. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల కంటే ఉన్నత స్థాయిలో మహేష్ బాబు తో "భరత్ అనే నేను" సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా అలరించనున్నాడు.

అయితే ఈ మధ్య శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కి ఓ నటుడి వల్ల బ్రేక్ లు పడుతూ వస్తున్నాయట. ఆయన ఎవరో కాదు బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. కొరటాల కూడా మొదటి సారి ఈ మహా నటుడిని తన సినిమాలో తీసుకుంటున్నాడు. కానీ ప్రకాష్ రాజ్ తన వ్యవహార శైలితో సినిమా యూనిట్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాడట. ఆయన వల్ల ఈ సినిమా కొన్ని సార్లు ఒక్క షాట్ కూడా తీయకుండానే ప్యాకప్ చేశారట కొరటాల. అందుకు కారణం ఆయన షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కి రాకపోవడమేనని తెలుస్తోంది. దీంతో చిర్రెత్తిపోయిన కొరటాల ఆ నటుడి స్థానంలో వేరే ఒకరిని తీసుకుంటే బెటర్ అనే ఆలోచనలో పడ్డారట.

ప్రకాష్ రాజ్ ఈ తరహాలో ప్రవర్తించడం ఆయనకు కొత్తేమి కాదు. ఇంతకుముందు కూడా అనేక సార్లు షూటింగ్ కి సరిగ్గా హాజరు కాకుండా తెగ ఇబ్బంది పెట్టారని విమర్శలు వెలువడ్డాయి. అంతే కాకుండా ఆ మధ్యలో టాలీవుడ్ ఆయనపై నిషేధం కూడా విధించింది. కానీ ప్రకాష్ రాజ్ ఇప్పుడు అదే తరహాలో వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే భరత్ అనే నేను సినిమాను దర్శక నిర్మాతలు సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.