Begin typing your search above and press return to search.

మళ్లీ యూరోప్ చుట్టేయనున్న మహేష్

By:  Tupaki Desk   |   17 March 2017 8:41 AM GMT
మళ్లీ యూరోప్ చుట్టేయనున్న మహేష్
X
మహేష్ బాబు నటించిన 1నేనొక్కడినే చిత్రాన్ని.. ఇంగ్లాండ్.. ఐర్లాండ్.. స్కాట్లాండ్ లలో చిత్రీకరించారు. మహేష్ తన ఫ్యామిలీతో టూర్స్ కు వెళ్లినపుడు కూడా ఎక్కువగా యూరోప్ దేశాలనే చుట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు సూపర్ స్టార్ కొత్త సినిమా కూడా యూరోప్ లోనే ప్రారంభం కానుంది.

ప్రస్తుతం మురుగాదాస్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్న మహేష్.. ఏప్రిల్ నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తి చేసేయనున్నాడు. ఆ తర్వాత మే మొదటి వారం నుంచి కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా మొదలుపెట్టేస్తాడు మహేష్. ఈ చిత్రానికి 'భరత్ అనే నేను' అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ మూవీని యూరోప్ లో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు.. మహేష్ కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కూడా ఇంగ్లాండ్ లోనే తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం లొకేషన్స్ ను ఫైనలైజ్ చేయడంలో బిజీగా ఉన్నాడు కొరటాల శివ.

అయితే.. ఈ సినిమా స్టోరీ హైద్రాబాద్ బేస్డ్ గానే ఉంటుందని.. యూరోప్ లో కేవలం కొన్ని సీన్స్ మాత్రమే తీస్తారని తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాంద్ సంగీతం అందించనుండగా.. ఇప్పటికే మహేష్ కోసం పాటలు సిద్ధం చేసేసినట్లు అఫీషియల్ గా చెప్పేశాడు. అంతే కాదు.. టైటిల్ ను అధికారికంగా రివీల్ చేసింది కూడా దేవిశ్రీనే. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/