Begin typing your search above and press return to search.
మహేష్ డబుల్ ధమాకా లేనట్లే..
By: Tupaki Desk | 21 Feb 2017 10:33 AM ISTతెలుగులో స్టార్ హీరోలందరూ వేగం పెంచారు. ఏడాదికి రెండు రిలీజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ ఏడాదికి అలాగే ప్రణాళిక రచించుకున్నాడు. వేసవికి మురుగదాస్ సినిమాను రిలీజ్ చేసేసి.. దసరాకు లేదా ఏడాది చివరికి కొరటాల శివ సినిమాను షెడ్యూల్ చేద్దామని అనుకున్నాడు. అందుకోసం జనవరి-ఫిబ్రవరి మధ్య మురుగదాస్ సినిమాను పూర్తి చేయాలనుకున్నాడు. వెంటనే కొరటాల సినిమాను మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ అతను అనుకున్నట్లుగా పని జరగలేదు. మురుగదాస్ సినిమా లేటైంది. ఏప్రిల్ లేదా మేలో రావాల్సిన సినిమా జూన్ నెలాఖరుకు వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ కు కానీ అవ్వదట.
దీంతో కొరటాల శివ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి కూడా లేటవుతుంది. కొరటాల రిలీజ్ డేట్ విషయంలో డెడ్ లైన్లు పెట్టుకుని హడావుడి పడే రకం కాదు. ‘జనతా గ్యారేజ్’ విషయంలో ఇలాంటి తలనొప్పి ఎదురైతే మొహమాటం లేకుండా సినిమాను వాయిదా వేయించాడు. కాబట్టి మహేష్ సినిమా విషయంలో కూడా తొందరపడే అవకాశం లేదు. పైగా ‘జనతా గ్యారేజ్’ విషయంలో కొరటాల కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. సినిమా సూపర్ హిట్టయినా.. కొరటాల పకడ్బందీగా సినిమా తీయలేదన్న విమర్శలొచ్చాయి. అందుకే మహేష్ సినిమా మీద మరింత శ్రద్ధ పెడుతున్నాడతను. కాబట్టి దసరా టార్గెట్ పక్కకు వెళ్లినట్లే కనిపిస్తోంది. దసరా కాదంటే ఇక నెక్స్ట్ టార్గెట్ ఆటోమేటిగ్గా సంక్రాంతే. కాబట్టి ఈ ఏడాదికి మహేష్ డబుల్ ధమాకా లేనట్లే. మురుగదాస్ సినిమాతో అభిమానులు సరిపెట్టుకోవాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/