Begin typing your search above and press return to search.
బన్నీలాంటి యాక్టర్ భారతదేశంలో లేడు!
By: Tupaki Desk | 13 Dec 2021 8:25 AM IST'పుష్ప' సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకి గౌరవ అతిథిగా వచ్చిన కొరటాల శివ మాట్లాడుతూ .. 'పుష్ప'లాంటి సినిమా చేయాలంటే .. ఇలాంటి ఒక యూనివర్స్ ను క్రియేట్ చేయాలంటే .. ఇలాంటి పాత్రలను క్రియేట్ చేయాలంటే సుకుమార్ తప్ప ఇంకా ఎవరూ చేయలేరు. అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను. ఫస్టు సినిమా నుంచి ఇప్పటివరకూ అదే కమిట్మెంట్ .. అదే ఫ్యాషన్. ఇక్కడ ఇంత ఫంక్షన్ జరుగుతూ ఉంటే, ఫైనల్ ప్రోడక్ట్ కోసం తాను బాంబేలో ఎంతో కష్టపడుతున్నాడు .. రియల్లీ హ్యాట్సాఫ్.
ఇక ఇప్పుడు నేను మాట్లాడుతున్నది సుక్కు స్పీచ్ .. నా స్పీచ్ కాదు. "మా మైత్రీ మూవీ మేకర్స్ వారికి సినిమానే ఇంపార్టెంట్ .. సినిమా అంటే ప్రాణం. అలాంటి మైత్రీవారు చాలా సినిమాలు చేయాలి. డీవోపీ 'కూబా' గారు .. రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్. మారేడుమిల్లి ఫారెస్టులో షూట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు .. నిజంగా ఆయనది చాలా గ్రేట్ జాబ్. రష్మిక విషయానికి వస్తే 'డీ గ్లామర్ రోల్ అయినా చాలా అందంగా ఉన్నారు. సునీల్ .. అనసూయ కూడా డిఫరెంట్ రోల్స్ చేశారు. తెరపై వాళ్ల పాత్రలు మాత్రమే కనపడతాయి.
అల్లు అర్జున్ గారు .. నేను మీ ఫ్యాన్ ను. సినిమా .. సినిమాకి ఇంతగా ఎదుగుతున్న నటుడు భారతదేశంలోనే లేడంటే అతిశయోక్తి లేదు. నేను .. బన్నీ ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందామని అనుకుంటాము. అది కాస్తా రెండు మూడు గంటలు అవుతుంది. ఈ లోగా ఐదారు కాఫీలు తాగేస్తాము. సినిమా తప్ప రెండవ టాపిక్ ను ఆయన తీసుకురాడు. ఏదో చేద్దామనే కసి ఆయనలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ స్థాయిలో ఎఫర్ట్ పెట్టి ఒక పాత్రకి జీవం పోసే ఒక యాక్టర్ డెఫినెట్ గా లేడు.
'పుష్ప' సినిమా కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. 17వ తేదీన ఫస్టు షో చూస్తాను.'పుష్ప 2' తరువాత ఇంతకంటే పెద్ద కథతో మీ దగ్గరికి వస్తాను. మీలాంటి హీరోకి ఇంకా ఎంత ఛాలెంజింగ్ గా రాయాలనేది అర్థమవుతోంది. ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను .. అలాగే నా మిత్రుడు సుక్కూకి కూడా" అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలనేది సుక్కూ మాటగా అనుకోవాలా? కొరటాల కోరిక అనుకోవాలా? అనేదే అభిమానులకు అర్థం కాలేదు.