Begin typing your search above and press return to search.
మళ్లీ జనతా గ్యారేజ్ కాంబినేషన్
By: Tupaki Desk | 10 May 2017 11:55 AM ISTఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్ కలిసి హిట్టు కొట్టారంటే.. మళ్లీ ఏదో ఒక రోజు ఆ కాంబినేషన్ రిపీటవ్వాల్సిందే. ‘జనతా గ్యారేజ్’ కాంబినేషన్ విషయంలోనూ ఇలాగే జరగబోతోందని సమాచారం. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినర కొరటాల శివ.. తనకు అత్యంత ఆప్తుడైన కథానాయకుడితో మళ్లీ పని చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్న కొరటాల.. దీని తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక లైన్ రెడీ చేశాడని.. అది ఎన్టీఆర్ కు వినిపించడం.. అతను ఓకే చెప్పడం జరిగిపోయాయట. ఈ సినిమాను కొందరు ఎన్నారైలు కలిసి నిర్మించబోతున్నారట.
ప్రస్తుతం ఎన్టీఆర్.. బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చేస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కోసం డేట్లు కేటాయించాడు. ఆ సినిమా కూడా చాలా వేగంగానే పూర్తయిపోతుంది. కొరటాల ‘భరత్ అను నేను’ పూర్తి చేసే సమయానికి కాస్త అటు ఇటుగా తారక్ ఫ్రీ అవుతాడు. 2018 మొదట్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. ‘బాహుబలి’ తర్వాత ఫ్రీ అయిన రాజమౌళితో పని చేయాలని ఎన్టీఆర్ కు ఉన్నప్పటికీ.. జక్కన్నకు వేరే కమిట్మెంట్ ఉందని.. ఇప్పుడే ఎన్టీఆర్ తో పని చేసే అవకాశం లేదని సమాచారం. అందుకే కొరటాలకు ఓకే చెప్పేశాడు. కొరటాల ఇప్పటిదాకా చేసిన మూడు సినిమాలతోనూ బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ‘భరత్ అను నేను’ కూడా హిట్టయితే ఇక అతడి రేంజే వేరుగా ఉంటుంది. అప్పటికి ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి ఉంటాడు కాబట్టి.. కొరటాలతో సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.