Begin typing your search above and press return to search.

'బి ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ పూర్తి చేసిన స్టార్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   22 April 2020 8:01 PM IST
బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన స్టార్ డైరెక్టర్..!
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో 'బి ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండింగ్‌ లో ఉంది. ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ.. ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఖాళీగా ఉన్న భర్తలు తమ భార్యలకు సాయం చేయాలని.. అతనే 'రియల్ మ్యాన్' అంటూ 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ లో ఒక్కొక్కరుగా భాగస్వామ్యం అవుతున్నారు. రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - సుకుమార్ - కీరవాణి ఇలా స్టార్ హీరోలు దర్శకులు ఇంట్లో వాళ్ల భార్యలకు సాయం చేస్తూ వీడియోలను విడుదల చేసి వాళ్లు కూడా మరికొంత మందిని నామినేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ - సుకుమార్ నామినేట్ చేసిన వారిలో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కూడా ఉన్నారు.

తాజాగా ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లీనింగ్ మొదలు పెట్టేశారు. ఇప్పుడు మొదలు పెట్టడం కాదు.. నెల రోజులుగా ఇదే పనిలో ఉన్నా కాని ఆ ఫుటేజ్ మిస్ అయ్యింది.. అంటూ ఎన్టీఆర్ ఛాలెంజ్‌ ను యాక్సెప్ట్ చేసిన కొరటాల శివ ఇంట్లో ఉన్న గిన్నెల్ని శుభ్రం చేస్తూ.. డైనింగ్ టేబుల్‌ తో పాటు ఫ్లోర్ క్లీన్ చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇదిగో తారక్ అన్నయ్యా అంటూ 'మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా.. రాను రాను అలవాటయ్యి.. ఇప్పుడు సరదా అయింది’ అంటూ ఫన్నీ కామెంట్ కూడా జత చేశారు కొరటాల శివ. ఈ ఛాలెంజ్‌ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండను నామినేట్ చేశారు కొరటాల. ఇప్పటి వరకూ ఈ ఛాలెంజ్‌ లో పాల్గొన్న వారంతా తమ భార్యలకు సాయం చేస్తూనే కనిపించారు మరి విజయ్ దేవరకొండకు ఇంకా పెళ్లి కాలేదు.. కాబట్టి తన తల్లికి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ వీడియో విడుదల చేస్తారేమో చూడాలి. ఈ #BeTheREALMAN ఛాలెంజ్ సందీప్ వంగా నుండి స్టార్ట్ అయ్యి రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - కీరవాణి - కొరటాల శివ - సుకుమార్ ల దాకా చేరింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ - థమన్ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసియున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ఛాలెంజ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.