Begin typing your search above and press return to search.

లోపాలు ఒప్పుకున్న కొర‌టాల శివ‌

By:  Tupaki Desk   |   6 Sept 2016 3:28 PM IST
లోపాలు ఒప్పుకున్న కొర‌టాల శివ‌
X
సినిమా ఇండ‌స్ట్రీలో ఏ ద‌ర్శ‌కుడికి అయినా ఒక‌టి రెండు హిట్లు రాగానే వ‌చ్చే క్రేజ్ అలా ఇలా ఉండ‌దు. ఆ డైరెక్ట‌ర్‌ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉంటారు. అలాంటిది ముగ్గురు టాప్ హీరోల‌తో మూడు వ‌రుస బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన డైరెక్ట‌ర్‌ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు సైతం అదిరిపోయే క్రేజ్ ఉంది.

మిర్చి - శ్రీమంతుడు - తాజాగా జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ల‌తో కొర‌టాల క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు కొర‌టాల నాలుగో సినిమాను మ‌హేష్‌ కే చేస్తున్నాడు. మ‌హేష్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ కొర‌టాల‌తో కావాల‌ని సినిమా చేస్తున్నాడు. మూడు హిట్ల‌తో మంచి జోష్‌ లో ఉన్న కొర‌టాల జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌మోష‌న్స్‌ లో బిజీ బిజీగా ఉంటున్నాడు.

సాధార‌ణంగా ఏ డైరెక్ట‌ర్ అయినా సినిమా హిట్ అయితే ఆ సినిమాలో ఉన్న లోపాల‌ను క‌ప్పి పెట్టేందుకే ఏవో క‌ట్టుక‌థ‌లు అల్లేందుకు ట్రై చేస్తారు. ఇలాంటి డైరెక్ట‌ర్ల‌కు కొర‌టాల పూర్తి అపొజిట్‌ గా ఉంటున్నారు. త‌న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. ద‌ర్శ‌కుడు శివ ఓ ఇంట‌ర్వ్యూలో మాత్రం త‌న‌లో ఉన్న లోపాల‌ను ఓపెన్‌ గా చెప్పి షాక్ ఇచ్చాడు.

త‌న‌కు టెక్నిక‌ల్‌ గా అంత నాలెడ్జ్ లేద‌ని...కెమేరా యాంగిల్స్ విష‌యంలో కూడా తాను పూర్ అని చెప్పాడు. అందుకే త‌న సినిమాల‌కు మ‌ది - తిరు లాంటి టాప్ సినిమాటోగ్రాఫ‌ర్స్‌ ను తీసుకుంటాన‌న్నారు. ఇక జ‌న‌తా గ్యారేజ్ పూర్తి ఎమోష‌న‌ల్ కంటెంట్ మూవీ అని..అందుకే ఈ సినిమాలో కామెడీని ఇరికించే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని చెప్పాడు. దీంతో కొర‌టాల త‌న‌లోని లోపాల‌ను త‌నంత‌ట తాను ఓపెన్‌గా చెప్ప‌డం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది. కొర‌టాల నిజాయితీని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.