Begin typing your search above and press return to search.

ఈ సినిమాలో చరణ్ కి జోడి ఉందంటున్న డైరెక్టర్ !

By:  Tupaki Desk   |   16 April 2020 5:34 PM GMT
ఈ సినిమాలో చరణ్ కి జోడి ఉందంటున్న డైరెక్టర్ !
X
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ మూవీని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆచార్య అనే పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే లో నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకావాల్సి ఉందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. చిరంజీవి, చరణ్ గతంలో తెరపై కలిసి కనిపించారు కానీ కొంత నిడివిగల పాత్ర చేయలేదు.

అయితే ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర దాదాపుగా 30 నుండి 40నిముషాల వరకు ఉంటుందని కొరటాల తాజాగా వెల్లడించారు. తాజాగా ఆచార్య సినిమా గురించి డైరెక్టర్ కొరటాల శివ కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. ఈ సినిమాలో చరణ్ కు ఒక హీరోయిన్ కూడా ఉంటుందట. ఇప్పుడు ఆ హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారట చిత్ర బృందం. ఈ సినిమాలో చిరుకి జంటగా కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరి చరణ్ కు జోడిగా ఎవరు నటిస్తారో చూడాలి మరి. అంతేగాక లాక్ డౌన్ లేకపోతే ఈ పాటికి సినిమా షూటింగ్ పూర్తి కావచ్చేదని తెలిపాడు శివ. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడి ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ కి సమాచారం అందించారు కొరటాల.