Begin typing your search above and press return to search.
తన రిటైర్మెంట్ గురించి బయటపెట్టిన స్టార్ డైరెక్టర్
By: Tupaki Desk | 17 April 2020 10:30 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మాటల రచయితగా భద్ర, మున్నా, బృందావనం, సింహా వంటి సినిమాలకు పనిచేసిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కమర్షియల్ హంగులతో పాటు ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూ సినిమాని తీయడం ఆయన తీరు. మిర్చి సినిమా తర్వాత శ్రీమంతుడు - జనతా గ్యారేజ్, భరత్ అను నేను సినిమాలను తెరకెక్కించి వరుస భారీ విజయాలను అందుకున్నారు. టాలీవుడ్ లో దర్శకదీరుడు రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని మరో దర్శకుడిగా పేరు పొందారు.
అయితే తాజాగా కొరటాల తన రిటైర్మెంట్ పై సంచలన వాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లలో తాను రిటైర్ అవుతున్నట్టు స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు తన దగ్గర ఉన్న స్క్రిప్టులతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నానని - ఇవి తీయడానికి మరో ఐదేళ్ళు పడుతుందని - ఆ తరవాత తాను దర్శకుడిగా రిటైర్ మెంట్ తీసుకుంటానని కొరటాల వాఖ్యానించారు. అయితే ఇందుకు గల కారణం కూడా ఆయన వెల్లడించారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కొరటాల స్పష్టం చేశారు. అయితే అయన కొత్త దర్శకులను పరిచయం చేయడానికి నిర్మాతగా మారనున్నారని సమాచారం.
ప్రస్తుతం కొరటాల ఆచార్య అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ - కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం 40 శాతం కంప్లీట్ అయిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. మరి ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా పైన అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.