Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 : ఆలియా నో వార్తలపై కొరటాల స్పందన

By:  Tupaki Desk   |   24 April 2022 1:30 AM GMT
ఎన్టీఆర్‌30 : ఆలియా నో వార్తలపై కొరటాల స్పందన
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది. గత ఏడాది కాలంగా ఈ సినిమా నానుతూ వస్తుంది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఆలస్యం అవ్వడం వల్ల.. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదల కరోనా వల్ల వాయిదా పడుతూ రావడం వల్ల ఎన్టీఆర్ 30 సినిమా అలా అలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయ్యింది... అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ను కూడా ఈ వారంలో విడుదల చేయబోతున్నారు. కనుక ఎన్టీఆర్‌ 30కి ఉన్న అవాంతరాలు.. అవరోధాలు అన్ని తొలగి పోయాయి. కనుక జూన్ నెలలో ఎన్టీఆర్‌ 30 సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు.

ఆచార్య సినిమా విడుదల సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన కొరటాల శివ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ 30 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని.. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పాడు. ఇక హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు కూడా కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు స్క్రిప్ట్‌ కేవలం ఎన్టీఆర్‌ కు మాత్రమే చెప్పాను. ఏ హీరోయిన్‌ కు కాని మరెవ్వరికి కాని చెప్పలేదు. హీరోయిన్‌ ఎవరు అనే విషయాన్ని నిర్ణయించుకున్న తర్వాత కథ చెప్తాను అన్నట్లుగా కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్ గా ఆలియా భట్‌ ను కొరటాల శివ అనుకున్నాడని.. ఆయన చెప్పిన స్క్రిప్ట్‌ కు ఆలియా నో చెప్పిందని ఇటీవల వార్తలు వచ్చాయి.

ఆలియా నో చెప్పిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తాజాగా కొరటాల శివ చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. ఆయన ఇప్పటి వరకు కథను ఏ హీరోయిన్ కు చెప్పలేదు అన్నాడు కనుక త్వరలోనే ఆలియా భట్‌ కు చెప్పే అవకాశాలు ఉన్నాయి. కథ తో మెప్పిస్తే తప్పకుండా ఆలియా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.