Begin typing your search above and press return to search.

దాచేసే వాళ్లు వైర‌స్ కంటే ప్ర‌మాద‌కారులు!!

By:  Tupaki Desk   |   15 July 2020 12:40 PM IST
దాచేసే వాళ్లు వైర‌స్ కంటే ప్ర‌మాద‌కారులు!!
X
స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల మ‌న‌సు నొచ్చుకుందా? అయితే ఆయ‌న‌ను అంత‌గా నొప్పించిన‌ది ఎవ‌రై ఉంటారు? అంటే అస‌లు మ్యాట‌ర్ లోకి వెళ్లాల్సింది. సంఘంలో బాధ్య‌తారాహిత్యంపై కొర‌టాల సైలెంట్ సెటైర్లు పెద్ద తెర‌పై ఎంత‌గా వ‌ర్కవుట‌య్యాయో చెప్పాల్సిన ప‌నే లేదు. శ్రీ‌మంతుడు.. భ‌ర‌త్ అనే నేను చిత్రాల్లో సామాజిక బాధ్య‌తకు సంబంధించిన సీన్లు ఓ రేంజులో కుదిరాయి అంటే అదంతా కొర‌టాల మైండ్ సెట్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. సంపాదించిన దాంట్లో కొంతైనా తిరిగివ్వాల‌ని శ్రీ‌మంతుడు చెబితే.. మ‌నిషి బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల న‌ష్టం అంతా ఇంతా కాద‌ని భ‌ర‌త్ అనే నేను లో చెప్పారు కొర‌టాల‌.

ఇప్పుడు రియాలిటీలోనూ అలాంటి బాధ్య‌తారాహిత్యాన్ని ప్ర‌శ్నించారు మ‌రోసారి. మ‌హ‌మ్మారీ విజృంభ‌ణ వేళ కొంద‌రి బాధ్యతారాహిత్యంపై కొర‌టాల వేసిన కౌంట‌ర్ మామూలుగా లేదు. ఆయ‌న సామాజిక మాధ్య‌మాల్లో బాధ‌ను వ్య‌క్తం చేసిన తీరు ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఎంతో తెలివిగా ఆయ‌న క‌లుగులోని ఎలుక‌ల్ని ప్ర‌శ్నించారు.

కోవిడ్ సోకిన కొంద‌రు బ‌య‌టికి చెప్ప‌కుండా దాచేస్తున్నారు. దీనివ‌ల్ల మ‌రింత‌మందికి పాకిపోయే ప్ర‌మాదం ఉంది. అలా కాకుండా చుట్టుప‌క్క‌ల వాళ్ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తే ప్ర‌మాద తీవ్ర‌త త‌గ్గించినవారు అవుతారు అని కొర‌టాల అన్నారు. రోగులు బాధ్య‌తతో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. ర‌హ‌స్యంగా దాచేవాళ్లు వైర‌స్ కంటే ప్ర‌మాద‌కారులు!! అని ఆయ‌న వ్యాఖ్యానించారు. వైర‌స్ సోకింది అన‌గానే ఇటీవ‌ల తాము క‌లిసిన అంద‌రికీ ఆ విష‌యాన్ని తెలియ‌జేయాల‌ని కొర‌టాల సూచించారు. దానివ‌ల్ల వారు కూడా టెస్టుల‌కు వెళ‌తారు. నాగ‌రికంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌య‌మిద‌ని అన్నారు. ఇతరుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవ‌రికీ లేదనేది ఆయ‌న ఆవేద‌న‌. దీనిని అంతా అర్థం చేసుకోవాలి. ఒక మంచి పాయింట్ నే చెప్పిన కొర‌టాల త‌న త‌దుప‌రి చిత్రంలో వాడేస్తాడేమో!