Begin typing your search above and press return to search.

నెల రోజుల ఫుటేజ్ మిస్స‌య్యింది తారక్ అన్నయ్యా...!

By:  Tupaki Desk   |   21 April 2020 4:20 PM IST
నెల రోజుల ఫుటేజ్ మిస్స‌య్యింది తారక్ అన్నయ్యా...!
X
లాక్‌ డౌన్ స‌మ‌యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్రమంలో ఇంట్లో మహిళలకు మరింత పనిభారం పెరుగుతోంది. వీటిని తగ్గించేందుకు టాలీవుడ్‌లో వినూత్నమైన ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టారు. తమ ఇళ్లలోని మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టలేరని.. ఇంటి పనులు చేస్తూ సాయపడతారని వారే నిజమైన మనుషులంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ ను మొదలుపెట్టాడు. సందీప్ వంగా ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేసి దర్శకధీరుడు రాజమౌళికి సవాల్ విసిరాడు. దర్శకధీరుడు రాజమౌళి ఆ సవాల్‌ను స్వీకరించి ఇంటి పనులను చేస్తూ.. కిటికీలను శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేస్తూ రామ్ చరణ్ - ఎన్టీఆర్ - శోభు యార్లగడ్డ - సుకుమార్ - కీరవాణిలకు ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు రాజమౌళి ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్ ఇంట్లో మరియు ఇంటి బయట పనులు చేస్తూ రియల్ మ్యాన్ అనిపించుకున్నాడు.

తారక్ ఈ సందర్భంగా 'మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం' అంటూ పోస్ట్ చేసాడు. తదుపరి ఈ సవాల్‌ ను సీనియర్ హీరోలందరికీ విసిరాడు. బాబాయ్ బాలయ్య - చిరంజీవి, -నాగార్జున బాబాయ్ - వెంకటేష్ - కొరటాల శివలకు ఈ ఛాలెంజ్‌ ను విసిరాడు. తారక్ విసిరిన మెగాస్టార్ చిరంజీవి కూడా స్వీకరిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. మరోవైపు ఎన్టీఆర్ విసిరిన చాలెంజ్‌ ను స్వీకరిస్తున్నట్టు కొరటాల శివ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ''థాంక్స్.. ఛాలెంజ్ అంగీకరిస్తున్నా తారక్ అన్నయ్యా!.. ఇప్ప‌టికే నెల‌రోజుల ఫుటేజ్ మిస్స‌య్యింది’’ అంటూ ఫ‌న్నీ ట్వీట్ చేశారు. అంటే ఈ లెక్కన్న కొరటాల గత నెల రోజులుగా ఇంటి పనులు చేస్తున్నాడన్నమాట. 'బీ ది రియల్ మ్యాన్' అంటూ ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ స్టార్ట్ చేసిన ఛాలెంజ్ కొరటాల శివ ఎప్పటి నుండో డైలీ చేస్తున్నాడన్నమాట. ఇదిలా ఉండగా కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.