Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 : కొరటాల రెడీ ముహూర్తం కూడా ఫిక్స్

By:  Tupaki Desk   |   30 March 2022 5:33 AM GMT
ఎన్టీఆర్‌30 : కొరటాల రెడీ ముహూర్తం కూడా ఫిక్స్
X
ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు కలిసి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో నటించారు. ఆ సినిమా ప్రారంభంకు ఏడాది ముందు నుండే ఎన్టీఆర్ మరే సినిమా చేయలేదు. కాని చరణ్ మాత్రం ఒక సినిమా తో వచ్చేశాడు. ఇక ఆర్ ఆర్ ఆర్‌ విడుదలకు ముందే శంకర్ దర్శకత్వంలో సినిమా ను చరణ్ మొదలు పెట్టాడు. కాని ఎన్టీఆర్ మాత్రం కమిట్‌ అయ్యాడు కాని షూటింగ్‌ ను మొదలు పెట్టలేదు. ఎన్టీఆర్‌ 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్‌ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా ఉండబోతుంది. ఆ సినిమాను జూన్‌ నెలలో పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ ఆర్‌ ఆర్‌ ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తీసుకుంటాడట. అలాగే ఆచార్య సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడు.

వచ్చే నెలలో ఆచార్య సినిమా విడుదల అయిన తర్వాత కొరటాల శివ పూర్తిగా ఫ్రీ అవుతాడు. అప్పుడు ఎన్టీఆర్‌ 30 సినిమాకు సంబంధించిన హడావుడి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా రెడీ అయ్యింది. కొరటాల శివ రెడీగానే ఉన్నాడు. కాని ఎన్టీఆర్‌ విశ్రాంతి కోరుకోవడంతో పాటు.. ఆచార్య సినిమా విడుదల ఉండటం వల్ల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆలియా భట్‌ ను ఈ సినిమా కోసం సంప్రదించారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. జాన్వీ కపూర్‌ అయినా ఎన్టీఆర్‌ కు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ 30 లో ఒక బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నటించడం దాదాపుగా కన్ఫర్మ్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతంలోనే ఒక సినిమా వచ్చింది. జనతా గ్యారేజ్ గా వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ మరో సారి ఎన్టీఆర్‌ కు బ్లాక్ బస్టర్‌ విజయాన్ని ఇస్తాడేమో చూడాలి.