Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కూడా హీరోయిన్ కాళ్లు...

By:  Tupaki Desk   |   13 July 2016 11:33 AM GMT
ఎన్టీఆర్ కూడా హీరోయిన్ కాళ్లు...
X
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఏ మాత్రం కొదువ ఉండదు. రోజుకో సెంటిమెంట్ పుట్టుకొస్తూనే ఉంటుంది. ఓ సినిమా అనుకున్నప్పటి నుంచి హిట్టు కోసం పది సెంటిమెంట్లు.. ఫ్లాప్ కోసం పాతిక సెంటిమెంట్లు వెతికేస్తూ ఉంటారు. ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్ పై 3 సెంటిమెంట్స్ గుర్తు చేస్తున్నారు సినీ జనాలు. అయితే.. ఇవేవీ ఎన్టీఆర్ కి సంబంధించినవి కావు.. అన్నీ కొరటాల క్యాంప్ వే కావడం విశేషం.

కొరటాల మొదటి సినిమా మిర్చిలో.. ప్రభాస్ స్టూడెంట్ గా కనిపిస్తాడు. రెండో సినిమా శ్రీమంతుడులో మహేష్ ని కూడా ఓ స్టూడెంట్ గా చూపించాడు. ఈ రెండు సినిమాల్లోనూ కాలేజ్ సీన్స్ అద్భుతంగా పండాయి. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో కూడా ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్ కా కనిపించనున్నాడు. ఇది మొదటి సెంటిమెంట్ అయితే.. రెండోది హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం. మిర్చిలో అనుష్క కాళ్లను ప్రభాస్ పట్టుకున్నట్లుగా చూపిస్తాడు కొరటాల. అదే విధంగా శ్రీమంతుడులో కూడా ఇలాంటి సీన్ ఉంటుంది. రెండు సీన్స్ మాంచి రొమాంటిక్ ఫీల్ తో అదరగొట్టేస్తాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ని కూడా సమంత కాళ్లు పట్టుకున్నట్లుగా చూపిస్తాడా అనుకుంటున్నారు అభిమానులు.

ఇక మూడో సెంటిమెంట్ ఏంటంటే.. ఫైటింగ్ సీన్స్. రౌడీలను తన రెండుచేతులతో పైకెత్తి కింద పడేయడం వంటి సీన్స్ అటు మిర్చి లోను.. ఇటు శ్రీమంతుడులోను కనిపిస్తాయి. ఎన్టీఆర్ కి అయితే ఇలాంటి ఫైట్స్ కొట్టిన పిండి. మరి మనకు తెలిసిన ఈ సెంటిమెంట్స్ తో పాటు.. మరెన్ని చూపిస్తాడో కొరటాల.