Begin typing your search above and press return to search.

వీడియో: 'కోరమీసం పోలీసోడా' అంటూ రవితేజతో రొమాన్స్ చేస్తున్న శృతి

By:  Tupaki Desk   |   25 Dec 2020 10:28 AM IST
వీడియో: కోరమీసం పోలీసోడా అంటూ రవితేజతో రొమాన్స్ చేస్తున్న శృతి
X
మాస్ మహారాజ్ ర‌వితేజ‌ - శృతి హాస‌న్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'క్రాక్'. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్‌ ఫుల్ పోలీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇప్పటికే విడుదలైన 'భూమ్ బ‌ద్ద‌ల్' 'భలేగా తగిలావే బంగారం' సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు కిష్మస్ కానుకగా 'కోర‌మీసం పోలీసోడా' అనే సాంగ్ లిరిక‌ల్ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

'కోరమీసం పోలీసోడా' సాంగ్ లిరిక్స్ చూస్తుంటే ఇదొక రొమాంటిక్ సన్నివేశంలో వచ్చే పాట అని అర్థం అవుతోంది. 'ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో.. నీ జంట కట్టింది ఒంటి మీద ఖాకీ.. అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో.. నీ తలుపు తట్టింది ఏరి కోరి వెతికీ' అంటూ పోలీస్ అయిన భర్తతో భార్య పాడుకునే పాట అని తెలుస్తోంది. 'నీ అండ చూసింది నెత్తెక్కి కూర్చుంది నన్నెల్లి పొమ్మంది సవతి.. రవ్వంత నీపక్క చోటివ్వనంటుంది పొట్లాట కొస్తోంది దండెత్తి.. ఆ సంగతేందో ఓ కాస్తా నువ్వే తేల్చుకోరా పెనిమిటీ' అంటూ భర్త ఎంత సిన్సియర్ పోలీస్ అనేది వెల్లడిస్తూనే నన్ను కూడా పట్టించుకోమని అడుగుతోంది.

'కోరమీసం పోలీసోడా.. నన్ను కొంచం చూసుకోరా.. గుండె మీదే నక్షత్రంలా.. నన్ను నీతో ఉండనీరా..' అంటూ సాగే ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. రమ్య బెహరా ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ మెలోడీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఇందులో శృతి హాస‌న్‌ రవితేజతో క‌లిసి శృతిమించిన రొమాన్స్ చేసిందని తెలుస్తోంది. గ‌తంలో 'బ‌లుపు' చిత్రంలో అలరించిన ఈ జంట తమ కెమిస్ట్రీతో ఇప్పుడు మరోసారి ప్రేక్ష‌కుల‌ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధ‌మ‌య్యారు.

గోపిచంద్ మలినేని - రవితేజ కలయికలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.